కుక్క కుక్కకో QR కోడ్.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. దీంతోపాటు వాటిని ట్రాక్ చేయడానికి ఏకంగా..
దేశవ్యాప్తంగా ప్రస్తుతం వీధి కుక్కల (Stray Dogs) అంశం చర్చనీయాంశంగా మారింది. వీధి కుక్కల సమస్యపై ఇటీవల సుప్రీంకోర్టు..

Stray Dogs
Stray Dogs : దేశవ్యాప్తంగా ప్రస్తుతం వీధి కుక్కల (Stray Dogs) అంశం చర్చనీయాంశంగా మారింది. వీధి కుక్కల సమస్యపై ఇటీవల సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే.
కేంద్ర పశుసంవర్థక మంత్రిత్వశాఖ వద్దనున్న గణాంకాల ప్రకారం.. కుక్కకాటు కేసులు ప్రతీయేటా పెరుగుతున్నాయి.
Also Read: Telangana : రేవంత్ సర్కార్ బిగ్ ప్లాన్.. వచ్చేనెల నుంచి రేషన్‌తోపాటు ఫ్రీగా బ్యాగులు.. ఎందుకంటే?
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఇటీవల వీధికుక్కల (Stray Dogs) బెడదపై సుప్రీంకోర్టు స్వయంగా చర్యలకు ఆదేశించింది.
ఈ క్రమంలో కుక్కల బెడదను అరికట్టే ప్రయత్నంలో భాగంగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టింది.
ఢిల్లీలో మాధిరిగానే సిమ్లాలోనూ వీధి కుక్కల సంచారం తీవ్ర సమస్యగా మారింది. రద్దీగా ఉండే మార్కెట్లు, నివాస ప్రాంతాల్లో పౌరులు వీటి కాట్లకు గురవుతున్నారు.
ముఖ్యంగా పిల్లలు, వృద్ధులను కుక్కలు కరిచిన సంఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. కుక్కలు వెంట పడుతుండటంతో స్థానిక ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
సిమ్లా నగరంలో ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వందల సంఖ్యలో కుక్కకాటు కేసులు నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.
కుక్కల బెడదకు చెక్ పెట్టేందుకు సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. వీధి కుక్కలకు క్యూఆర్ కోడ్, జీపీఎస్‌ను అమర్చాలని నిర్ణయించింది.
క్యూఆర్ కోడ్‌లో సెర్టిలైజేషన్, వ్యాక్సినేషన్ సమాచార నమోదు, వాటి ఆరోగ్య పరిస్థితి, వయసు వంటి సమాచారం పొందుపరుస్తారు.
క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా వాటి వివరాలను తెలుసుకోవచ్చు. జీపీఎస్ సహాయంతో వీధి కుక్కల లొకేషన్‌పై ఎప్పటికప్పుడు నిఘా ఉంచొచ్చు.
తద్వారా పరిస్థితులను పరిశీలించొచ్చునని సిమ్లా నగరపాలిక అధికార యంత్రాంగం వెల్లడించింది. అయితే, సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ వీధి కుక్కలకు స్మార్ట్ ట్యాగ్‌లను అమర్చడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: పావురాల రెట్టలు మనుషులను చంపుతాయి.. కుమార్తె మరణంతో పుణె మాజీ కార్పొరేటర్ కీలక నిర్ణయం..
దేశ రాజధాని ఢిల్లీ, ఇతర ప్రధాన నగరాల్లో కుక్కకాటు బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో ఆగస్టు 11న సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.
ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సంరక్షణ కేంద్రాలు (షెల్టర్లు) ఏర్పాటు చేసి వీధి కుక్కలను అక్కడికి తరలించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ), న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ)లను ఆదేశించింది. ఈ షెల్టర్లలో స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ సౌకర్యాలతోపాటు సీసీ టీవీ కెమెరాలు ఉండాలని ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది.
అయితే, ఈ తీర్పుపై సెలెబ్రెటీలు, పలు వర్గాల ప్రజల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. ఆగస్టు 11న ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
మరోవైపు నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్.వి.అంజరియాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
విచారణ అనంతరం స్థానిక అధికారుల బాధ్యతారాహిత్యమే ఈ సమస్యకు కారణమని, జంతు సంతతి నియంత్రణ చర్యలు చేపట్టకపోవడం ఈ పరిస్థితికి దారితీసిందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఆగస్టు 11న తీర్పుపై స్టే విధించాలన్న వాదనపై తీర్పును సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం రిజర్వు చేసింది.