Omicron AP : ఏపీలో కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు

తూర్పు గోదావరి జిల్లాలో 3 కేసులు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 2 చొప్పున నమోదు అయ్యాయి. చిత్తూరు, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకటి చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి.

Omicron AP : ఏపీలో కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు

Omicron

Updated On : December 29, 2021 / 3:47 PM IST

Omicron cases in AP : ఏపీలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా రాష్ట్రంలో 10 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం ఒమిక్రాన్ కేసులు 16కి చేరాయి.

తూర్పు గోదావరి జిల్లాలో 3 కేసులు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 2 చొప్పున నమోదు అయ్యాయి. చిత్తూరు, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకటి చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి.

Fire Accident : బీహార్ లోని గయ రైల్వే స్టేషన్ లో అగ్నిప్రమాదం

కొత్తగా నమోదైన 10 ఒమిక్రాన్ కేసుల్లో మూడు కాంటాక్టు కేసులు ఉన్నాయి. కువైట్, నైజీరియా, సౌదీ అరేబియా, యూఎస్ నుంచి వచ్చిన వారికి ఒమిక్రాన్ సోకింది.