Swamiji Dhirendra Krishna Shastri
Man Threatened To Kill Swamiji : ఉత్తర్ ప్రదేశ్ లో భాగేశ్వర్ ధామ్ కు చెందిన స్వామీజీ ధీరేంద్ర కృష్ణ శాస్త్రిని చంపేస్తామని బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బరేలికి చెందిన అనస్ అన్సారీ సోషల్ మీడియా వేదికైన ఇన్ స్టాగ్రామ్ లో ధీరేంద్ర కృష్ణ శాస్త్రిని చంపేస్తామని బెదిరిస్తూ పోస్టు చేశాడు.
అనస్ అన్సారీపై హఫీజ్ గంజ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి అనస్ అన్సారీని అదుపులోకి తీసుకున్నామని రాయ్ బరేలీ ఎస్సీ రాజ్ కుమార్ అగర్వాల్ పేర్కొన్నారు.
Delhi CM Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను చంపేస్తామని బెదిరింపు కాల్ ..
సోషల్ మీడియా పోస్టుకు సంబంధించి స్థానిక హిందూ గ్రూప్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు అన్సారీని అరెస్టు చేశారు. నిందితుడిపై ఎఫ్ ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.