Aadhaar Update: పిల్లల ఆధార్‌లో బిగ్ అప్‌డేట్.. ఈ నిబంధనలు పాటించకపోతే కష్టమే.. UIDAI కీలక సూచనలు

పిల్లల ఆధార్ (Aadhaar Update)బయోమెట్రిక్‌ను ప్రధానంగా రెండు వయోపరిమితుల్లో అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.

Mandatory biometric update for children aadhaar card

  • ఐదేళ్లకు బయోమెట్రిక్ వివరాల అప్‌డేట్
  • పదిహేనేళ్లకు రెండోసారి ఉచిత నవీకరణ
  • ఆధార్ కేంద్రాల్లో ప్రత్యక్ష నమోదు ప్రక్రియ

Aadhaar Update: చిన్న పిల్లల పేరిట ఆధార్ కార్డు తీసుకోవడం ఎంత ముఖ్యమో, వారు పెరుగుతున్న కొద్దీ అందులోని బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేయడం కూడా అంతే అత్యవసరం. ఐదేళ్లలోపు పిల్లలకు ఆధార్ జారీ చేసే సమయంలో కేవలం వారి పేరు, పుట్టిన తేదీ, చిరునామా, ఫొటో మాత్రమే సేకరిస్తారు. పిల్లల వేలిముద్రలు, కంటి ఐరిస్ వివరాలు ఆ వయసులో నమోదు చేయరు. కాబట్టి పిల్లల వయస్సు పెరిగే కొద్దీ ఈ వివరాలను ఆధార్‌లో చేర్చడాన్నే మాండేటరీ బయోమెట్రిక్ అప్‌డేట్ అంటారు.

Ap Rains: ఏపీ వ్యాప్తంగా భారీ వర్ష సూచన.. మత్స్యకారులకు హెచ్చరిక.. అన్ని తీర ప్రాంతాల్లో హైఅలర్ట్!

రెండు దశల్లో బయోమెట్రిక్ అప్‌డేట్:

పిల్లల ఆధార్ (Aadhaar Update)బయోమెట్రిక్‌ను ప్రధానంగా రెండు వయోపరిమితుల్లో అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. మొదటిసారి పిల్లలకు 5 ఏళ్లు పూర్తయిన తర్వాత, రెండోసారి 15 ఏళ్లు నిండిన తర్వాత ఐరిస్ స్కాన్, వేలిముద్రలు, కొత్త ఫొటోను అప్‌డేట్ చేయాలి. ఈ సేవలకు సంబంధించి 5 నుండి 17 ఏళ్ల లోపు ఉన్న పిల్లలకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. యూఐడీఏఐ వర్తింపజేసిన నిబంధనల ప్రకారం 2026 సెప్టెంబర్ 30 వరకు ఈ అప్‌డేట్‌ను పూర్తిగా ఉచితంగా చేసుకోవచ్చు.

అప్‌డేట్ చేయకపోతే ఇబ్బందులు:

ఒకవేళ ఈ బయోమెట్రిక్ వివరాలను సరైన సమయంలో అప్‌డేట్ చేయకపోతే భవిష్యత్తులో విద్యార్థులకు పథకాలు, స్కాలర్‌షిప్‌లు, కేవైసీ సేవలు పొందడంలో సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా NEET, JEE, CUET వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల సమయంలో ఆధార్ అథెంటికేషన్ వైఫల్యం చెందే అవకాశం ఉంది. ఈ ప్రక్రియను ఆన్‌లైన్‌లో చేయడానికి వీలుండదు. తల్లిదండ్రులు పిల్లలతో కలిసి సమీపంలోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కేంద్రానికి వెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. నమోదు పూర్తయ్యాక యూఆర్‌ఎన్ (URN) నంబర్‌ సహాయంతో యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో స్టేటస్‌ను సులభంగా పరిశీలించుకోవచ్చు.