Representative Image (Image Credit To Original Source)
Muppala Lakshmana Rao: మావోయిస్ట్ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగిపోతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో గణపతి లొంగిపోయే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. 50ఏళ్ల పాటు మావోయిస్ట్ ఉద్యమాన్ని నడిపిన ముప్పాళ్ల వెంకటేశ్వరరావు అలియాస్ గణపతి.. ఆపరేషన్ కగార్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం నేపాల్ లో ఆయన ఆశ్రయం పొందుతున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది.
మార్చి 31వ తేదీ నాటికి భారత్ లో మావోయిజం అంతం చేస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం .. అందుకు తగ్గట్లుగా ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులపై భారీ ఎత్తున దాడులు చేపట్టింది. హిడ్మా లాంటి కీలక నేతలను హత మార్చడమే కాకుండా దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి లాంటి టాప్ లీడర్లు లొంగిపోయేలా మావోయిస్టు పార్టీని దెబ్బతీసింది. ఈ క్రమంలోనే ఆ పార్టీ అగ్రనేత గణపతి నేపాల్ నుంచి ఢిల్లీకి చేరుకుని అమిత్ షా సమక్షంలో లొంగిపోతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తెలంగాణ పోలీసులతో రహస్య సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. వృద్దాప్యం, అనారోగ్య కారణాలతో లొంగిపోతున్నారని టాక్.