Agnipath : దేశాన్ని ఫాసిస్టు,నాజీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారు-అగ్నిపథ్ పై మావోయిస్టుల స్పందన

అగ్నిపథ్ ద్వారా దేశాన్ని ఫాసిస్టీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారని మమావోయిస్టు పార్టీ ఆరోపించింది. అగ్నిపథ్ ను అమలు చేయడం వెనక బీజేపీ ప్రభుత్వం కుట్ర దాగుందని పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఈరోజు విడుదల చేసిన లేఖలో పేర్కోన్నారు.

  • Published On : June 19, 2022 / 04:52 PM IST

Maoists reaction on Agnipath

Agnipath :  అగ్నిపథ్ ద్వారా దేశాన్ని ఫాసిస్టీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారని మమావోయిస్టు పార్టీ ఆరోపించింది. అగ్నిపథ్ ను అమలు చేయడం వెనక బీజేపీ ప్రభుత్వం కుట్ర దాగుందని పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఈరోజు విడుదల చేసిన లేఖలో పేర్కోన్నారు.  దేశాన్ని ఫాసిస్టీకరించి పౌర సమాజాన్ని విచ్ఛిన్నం చేసి సైనీకీకరించేందుకే ఈ పథకం అమలు చేస్తున్నారన్నారు.

సామ్రాజ్యవాద విధానాల వల్ల దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది. పర్మినెంట్ ఉద్యోగాలు లేని ఈ పరిస్థితుల్లో అగ్నిపథ్ ద్వారా యువతను బలవంతంగా సైన్యంలో చేర్పించుకోవడమే అవుతుంది. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి షరతులకు లోబడే ఈ స్కీంను అమలు చేస్తున్నారు. దేశంలో వర్గ పోరాటాలను, ప్రజా యుద్దాన్ని అణిచి వేసేందుకే ప్రభుత్వం అత్యంత కుట్ర పురితంగా ఈ పథకాన్ని ముందుకు తీసుకవచ్చింది. ఇప్పటికే చత్తీస్‌గడ్‌లోని స్థానిక యువతను పోలీసు బలగాల్లోకి తీసుకునే ప్రక్రియ మొదలైంది.

ఇదే విధానంతో ప్రారంభిస్తున్న అగ్నిపథ్ ద్వారా దేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, బీజేపీ సిద్దాంత భావజాల శిక్షణతో, నయా భారత్ పేరుతో దేశాన్ని హిందూ రాజ్యంగా రూపొందించుకునేందుకు ఈ ఏజెండా తోడ్పడుతుందన్నారు. వన్ నేషన్, వన్ ఎవ్రీథింగ్ అన్న నినాదంతో దేశాన్ని ఫాసిస్టు ఏకీకృత పద్దతిలో తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆలేఖలో విమర్శించారు.

Also Read : Agnipath : కేవలం అగ్నిపథ్ ద్వారానే రిక్రూట్ మెంట్..సాధారణ రిక్రూట్ మెంట్ లేదు : రక్షణ శాఖ