Agnipath : కేవలం అగ్నిపథ్ ద్వారానే రిక్రూట్ మెంట్..సాధారణ రిక్రూట్ మెంట్ లేదు : రక్షణ శాఖ

యువతకు అగ్నిపథ్ మేలు చేస్తుందని త్రివిధ దళాలు అంటున్నాయి. త్రివిధ దళాలు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నాయి. భారతీయ సైన్యానికి క్రమశిక్షణ తప్పనిసరి అనిల్ పురి అన్నారు.

Agnipath : కేవలం అగ్నిపథ్ ద్వారానే రిక్రూట్ మెంట్..సాధారణ రిక్రూట్ మెంట్ లేదు : రక్షణ శాఖ

Agnipath

Agnipath Recruitment : అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. పలు రాష్ట్రాల్లో ఆందోళన, పోరాటాలు చేస్తున్నారు.  అగ్నిపథ్ ను రద్దు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అయితే అగ్నిపథ్ పథకం విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. కేవలం అగ్నిపథ్ ద్వారానే రిక్రూట్ మెంట్ ఉంటుందని.. సాధారణ రిక్రూట్ మెంట్ లేదని భారత రక్షణ శాఖ స్పష్టం చేసింది. అగ్నిపథ్ పై యువతకు రక్షణ శాఖ క్లారిటీ ఇచ్చింది.

యువతకు అగ్నిపథ్ మేలు చేస్తుందని త్రివిధ దళాలు అంటున్నాయి. త్రివిధ దళాలు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నాయి. భారతీయ సైన్యానికి క్రమశిక్షణ తప్పనిసరి సైనిక వ్యవహారాల శాఖ అదనపు సెక్రటరీ అనిల్ పురి అన్నారు. విధ్వంసాలకు పాల్పడినవారికి ఆర్మీలో అవకాశమే లేదని తేల్చి చెప్పారు. కోచింగ్ సంస్థలు అభ్యర్థుల దగ్గర డబ్బులు తీసుకున్నాయని ఆరోపించారు.

Agnipath : త్రివిధ దళాధిపతులతో సమావేశం అయిన రాజ్‌నాధ్‌సింగ్

సైనిక ఉద్యోగాల కోసం 70 శాతం గ్రామాల నుంచే వస్తారని పేర్కొన్నారు. యువతను రెచ్చగొట్టడం వల్ల ఆందోళనలు జరిగాయని చెప్పారు. అగ్నివీర్ ల విషయంలో ఒక అండర్ టేకింగ్ ఉంటుందన్నారు. ఆందోళనల్లో పాల్గొనలేదని అండర్ టేకింగ్ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. యువత ఆందోళనల్లో పాల్గొనవద్దని సూచించారు.