Tarapith Fire Accedent: తారాపీఠ్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవదహనం.. బెంగాల్‌లో విషాదం
పశ్చిమ బెంగాల్ తారాపీఠ్(Tarapith Fire Accedent)లో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
- V Santhosh Kumar
- Published on- August 17, 2026 / 10:11 AM IST
Massive fire breaks out at tarapith hotel in bengal seven dead
- బెంగాల్ హోటల్‌లో అగ్నిప్రమాదం
- ఏడుగురు యాత్రికులు సజీవదహనం
- షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం
Tarapith Fire Accedent: పశ్చిమ బెంగాల్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బీర్భూమ్ జిల్లా తారాపీఠ్‌లో(Tarapith Fire Accedent) సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక్కడి ఓ నాలుగు అంతస్తుల ప్రైవేట్ హోటల్‌లో తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో, ఆ సమయంలో గాఢ నిద్రలో ఉన్న ఏడుగురు అతిథులు ఊపిరాడక, మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో ఫైర్ అలారం కూడా మోగకపోవడంతో తీవ్రత పెరిగినట్లు తెలుస్తోంది.
ఏసీ షార్ట్ సర్క్యూటే కారణమా?:
మొదటి అంతస్తులోని రిసెప్షన్ వద్ద ఉన్న ఏసీ యూనిట్‌లో షార్ట్ సర్క్యూట్ కావడం వల్లే ఈ అగ్నిప్రమాదం సంభవించి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. క్షతగాత్రులను రాంపూర్ హాట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. మృతుల్లో ఆలయ దర్శనానికి వచ్చిన యాత్రికులు కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చి, ఫైర్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనపై విచారణ వేగవంతం చేశారు.
