మిరాకిల్ జరుగలేదు: మేఘాలయలో 15 మంది కార్మికులు మృతి!

  • Publish Date - January 18, 2019 / 07:25 AM IST

మేఘాలయలోని జైంతియా హిల్స్‌ బొగ్గు గని (ర్యాట్ హోల్)లో చిక్కుకుపోయిన 15మంది కార్మికుల ఆచూకీ కోసం రెస్క్యూ సిబ్బంది చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. గనిలోని నీటిలో సల్ఫర్‌ శాతం ఎక్కువగా ఉండటంతో మృతదేహాలు త్వరగా కుళ్లిపోయినట్లు నిపుణులు భావిస్తున్నారు. దీంతో గనిలో చిక్కుకున్న కార్మికులందరూ మృత్యువాత పడి ఉంటారనే అంచనాకు వచ్చేశారు అధికారులు. రిమోర్ట్ అపరేటెడ్ వెహికల్స్ ద్వారా గనిలో అస్థిపంజరాలు వెలికితీశారు. డీఎస్ఏ పరీక్ష ద్వారా మృతుల వివరాలను నిర్ధారించనున్నామని అధికారులు తెలిపారు. మృతదేహాలను పరీక్షించేందుకు ఫొరెన్సిక్ నిపుణులు ఘటన స్థలానికి చేరనున్నారు. వారి సలహా మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని నేవీ డైవర్లు, సహాయక బృందాలు తెలిపాయి. వైద్యుల పరీవేక్షణలో గురువారం ఒకరి మృతిదేహాన్ని 370 అడుగుల లోతున్న గనిలో నుంచి వెలికితీశారు. వైద్యుల బృందాన్ని రెస్క్యూ సిబ్బందికి అవసరమైన సలహాలు ఇచ్చేందుకు తరలించినట్టు చెప్పారు. దేశంలో రెస్క్యూ సిబ్బంది నిర్వహించిన సుదీర్ఘ ఆపరేషన్ బహుశా ఇదే అయి ఉండొచ్చునని అంటున్నారు. తూర్పు జయంతీయా జిల్లాలో డిసెంబర్ 13న 15 మంది కార్మికులు 370 అడుగుల ర్యాట్ హోల్ బొగ్గు గనిలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే.  గనిలో కార్మికులు ఉన్న సమయంలో ఒక్కసారిగా వరదలు సంభవించడంతో గనిలోకి నీరు చొచ్చుకొచ్చింది. ఈ వరదల్లో కార్మికులంతా గల్లంతయ్యారు. ఈ క్రమంలో సహాయక చర్యలను ఆపొద్దని ఏదైనా అద్భుతం జరిగి గనిలో ఎవరైనా ప్రాణాలతో బయటపడే అవకాశాలు ఉన్నాయని సుప్రీంకోర్టు అధికారులకు సూచించింది. అప్పటి నుంచి కార్మికుల కోసం సహాయక చర్యలుక కొనసాగతూనే ఉన్నాయి.