Lalu Prasad Yadav : కూతురి ఇంట్లో లాలూ బర్త్ డే సెలబ్రేషన్స్
ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్ శుక్రవారం తన 74వ జన్మదిన వేడుకలను గురువారం ఢిల్లీలో నిరాడంబరంగా జరుపుకున్నారు.
- venkaiahnaidu
- Published On : June 11, 2021 / 07:33 PM IST
Lalu
Lalu Prasad Yadav ఆర్జేడీ చీఫ్,బీహార్ మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్ శుక్రవారం తన 74వ జన్మదిన వేడుకలను గురువారం ఢిల్లీలో నిరాడంబరంగా జరుపుకున్నారు. రాజ్యసభ ఎంపీ, లాలు కుమార్తె మీసా భారతి నివాసంలో జరిగిన ఈ బర్త్‌డే వేడుకల్లో కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు.
హ్యాపీ బర్డ్ డే పప్పాజీ అంటూ..లాలు కేక్ కట్ చేసిన ఫోటోలను,లాలుకి భార్య,మనువరాళ్లు కేక్ తినిపిస్తున్న ఫొటోలను మీసా భారతి ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ సందర్భంగా.. పలు రాష్ట్రాల సీఎంలు,నాయకులు,ప్రముఖులు లాలూకి బర్డ్ డే విషెస్ చెప్పారు.
లాలు పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తండ్రి బర్త్‌డే వేడుకలను పాట్నాలో నిర్వహించారు. మొక్కలను నాటడం,రక్తదానం శిబిరాలను ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. కాగా,దాణా కుంభకోణం కేసులో ఇటీవల లాలు బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే.
