Missing Dog Returns Home : మూన్నెళ్ల తర్వాత ఇంటికొచ్చిన పెంపుడు కుక్క.. యజమాని 60కి.మీ నడుచుకుంటూ వెళ్లి..

Missing Dog Returns Home After 3.5 Months : మూడున్నర నెలల పాటు కనిపించకుండా పోయిన పెంపుడు కుక్క చివరకు తన యజమాని వద్దకు క్షేమంగా చేరింది.

Missing Dog Returns Home

Missing Dog Returns Home After 3.5 Months : గుజరాత్‌లో జరిగిన ఓ హృదయాన్ని హత్తుకునే సంఘటన సోషల్ మీడియాలో అందరి మనసులను గెలుచుకుంటోంది. మూడున్నర నెలల పాటు కనిపించకుండా పోయిన ఓ పెంపుడు కుక్క చివరికి సురక్షితంగా తన యజమాని వద్దకు చేరింది. దీంతో అతను 60కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి తన మొక్కును తీర్చున్నాడు.

Also Read : FSSAI Report : మద్యం ప్రియులకు బిగ్ షాక్.. ప్రముఖ విస్కీ, రమ్ బ్రాండ్లపై నిషేదం.. FSSAI సంచలన నివేదిక

గుజరాత్‌ రాష్ట్రం బనస్కాంత జిల్లాలో కల్పేష్ పటేల్ అనే హోటల్ యజమాని ‘టైగర్’ అనే లాబ్రడార్‌ను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాడు. అయితే, మూడున్నర నెలల క్రితం అది కనిపించకుండా పోయింది. దీంతో యాజమాని దానికోసం అనేక ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో తన పెంపుడు కుక్క సురక్షితంగా తిరిగి వస్తే అంబాజీ అమ్మవారి ఆలయానికి దాదాపు 60 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి మొక్కు తీర్చుకుంటానని యజమాని మొక్కుకున్నాడు.

మూడున్నర నెలల తర్వాత పెంపుడు కుక్క తిరిగి యజమాని హోటల్ వద్దకు వచ్చింది. రోడ్డుపై వెళ్తున్న ఓ రిక్షాలో ఉన్న కుక్క తన యజమాని గొంతును గుర్తించి వెంటనే రిక్షా నుంచి దిగి పరుగెత్తుకుంటూ అతని వద్దకు చేరింది. ఈ భావోద్వేగ కలయిక అక్కడ ఉన్న వారిని కూడా కంటతడి పెట్టించింది.

తన టైగర్ ఇంటికి రావడంతో.. తాను మొక్కుకున్న మొక్కును తీర్చుకునేందుకు కల్పేష్ పటేల్ తన హోటల్‌ను తాత్కాలికంగా మూసివేసి, సిబ్బందితో పాటు టైగర్‌ను కూడా వెంట తీసుకుని అంబాజీ ఆలయానికి 60 కిలోమీటర్ల కాలినడక యాత్ర చేపట్టాడు. యాత్రలో భక్తిగీతాలు, నృత్యాలతో ఉత్సాహంగా ముందుకు సాగిన వారి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెంపుడు జంతువులు, వాటి యజమానుల మధ్య ఉండే అపూర్వమైన అనుబంధానికి ఈ ఘటన నిదర్శనంగా నిలిచిందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.