Durga pooja In Masjid : దసరా రోజున మసీదులో దుర్గా పూజ చేసిన వ్యక్తులు .. వారిపై చర్యలు తీసుకోకుంటే నిరసలు చేస్తామని ముస్లిం సంఘాల హెచ్చరిక

దసరా రోజున మసీదులో దుర్గా పూజ చేశారు కొంతమంది వ్యక్తులు. దీనిపై ముస్లింలు తీవ్రంగా మండిపడుతున్నారు. .. వారిపై చర్యలు తీసుకోకుంటే నిరసలు చేస్తామని ముస్లిం సంఘాల హెచ్చరించారు.

Durga pooja In Masjid : దసరా పండుగ రోజున కర్ణాటకలో హిందూ ముస్లింల మధ్య వివాదం రాజుకుంది. దసరా ఊరేగింపులో కొంతమంది బీదర్ లోని ఓ మసీదులోకి చొరబడి జై దుర్గామాత అంటూ నినాదాలు చేశారు. అంతేకాదు కొంతమంది మసీదులో దుర్గాపూజ చేశారు. దీనిపై ముస్లింలు మండిపడుతున్నారు. మా మనోభావాలను దెబ్బతీశారు అంటూ మండిపడ్డారు. ఈ ఘటనలో తొమ్మిదిమందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

కర్ణాటకలోని బీదర్ లో చారిత్రాత్మక మహమ్ముద్ గవాన్ మసీదు, మదరసాలో బుధవారం (అక్టబర్ 5,2022) రాత్రి మసీదులో దుర్గాపూజ్ చేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈక్రమంలో ఈ ఘటనకు పాల్పడిన తొమ్మిది మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై తీవ్రంగా మండిపడుతున్న ముస్లింలు సంఘాలు నిందితులందరినీ అరెస్ట్ చేయాలని లేకపోతే శుక్రవారం ప్రార్థనల నిర్వహించిన తరువాత నిరసన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించాయి.

ఈ ఘటనపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు మసీదు గేటు పగులగొట్టి మసీదును అపవిత్రం చేశారని మండిపడ్డారు. ఇటువంటి ఘటనపై సీఎం బసవరాజ్ బొమ్మై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఊరేగింపుల పేరుతో ఇటువంటి వివాదాలు సృష్టించేవారిపై చర్యలు తీసుకోవాలని సీఎం బసవరాజ్ బొమ్మై, బీదర్ పోలీసులను ఒవైసీ ప్రశ్నించారు. ముస్లింలను కించపరచడానికి బీజీపీ ఇటువంటి నీచ రాజకీయాలకు పాల్పడుతోంది అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. మసీదులో దుర్గా పూజ చేసిన వీడియోను ఒవైసీ షేర్ చేశారు.

 

 

ట్రెండింగ్ వార్తలు