Delhi Liquor Scam: మోదీ జీ ఎన్ని కుట్రలు చేయాలనుకుంటున్నారో అవన్నీ చేస్తారు: సిసోడియా
Delhi Liquor Scam: మోదీపై మనీశ్ సిసోడియా తీవ్ర విమర్శలు గుప్పించారు.
- T Venkateshwarlu
- Published On : April 29, 2023 / 09:17 PM IST
Manish Sisodia
Delhi Liquor Scam: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పై ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా (Manish Sisodia) తీవ్ర విమర్శలు గుప్పించారు. రూస్ అవెన్యూ కోర్టులో విచారణకు హాజరై అక్కడి నుంచి వెళ్తూ ఆయన మీడియాతో మాట్లాడారు.
“మోదీ జీ ఏం చేయాలనుకుంటారో అది చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అయితే, ఢిల్లీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) చేస్తున్న అభివృద్ధి పనులను మాత్రం మోదీ ఆపలేరు. మోదీ జీ ఎన్ని కుట్రలు చేయాలనుకుంటున్నారో అన్నీ చేస్తారు” అని మనీశ్ సిసోడియా వ్యాఖ్యానించారు.
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాంలోని మనీలాండరింగ్ కేసులో మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని మే 8 వరకు పొడిగిస్తూ ఇవాళ ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ నిర్ణయం తీసుకున్నారు. జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఆయనను అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులు మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే అనేక విషయాలు రాబట్టారు. మనీశ్ సిసోడియా కొన్ని వారాలుగా జైలులోనే ఉంటూ విచారణ ఎదుర్కొంటున్నారు. ఆయన బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. మనీశ్ సిసోడియాను ఫిబ్రవరి 26న అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో చార్జీషీట్ దాఖలు
