Monkey Steals Money : కొంపముంచిన కోతి.. లక్ష రూపాయలు ఎత్తికెళ్లి రోడ్డుపై చల్లింది

డబ్బుని టవల్ లో లేదా వస్త్రంలో మూటకట్టుకోవడం ఇప్పటికీ చాలామందికి అలవాటు. అదే అలవాటు ఒక వ్యక్తి కొంప ముంచింది. అతను టవల్‌లో చుట్టిపెట్టిన లక్ష రూపాయల డబ్బును ఒక కోతి ఎత్తుకెళ్లిపోయి

Monkey Steals Money : డబ్బుని టవల్ లో లేదా వస్త్రంలో మూటకట్టుకోవడం ఇప్పటికీ చాలామందికి అలవాటు. అదే అలవాటు ఒక వ్యక్తి కొంప ముంచింది. అతను టవల్‌లో చుట్టిపెట్టిన లక్ష రూపాయల డబ్బును ఒక కోతి ఎత్తుకెళ్లిపోయింది. అంతేకాదు ఆ టవల్ విదిలించి డబ్బును రోడ్డుపై వెదజల్లింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని కటవ్ ఘాట్‌ ప్రాంతంలో జరిగింది.

WhatsApp Down : పని చేయని వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా.. కారణం అదేనా? చైనా పనేనా?

ఒక ఆటోలో ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. వారిలో ఒక వ్యక్తి తన దగ్గరున్న రూ. లక్ష నగదును టవల్‌లో చుట్టి పెట్టుకున్నాడు. మార్గమధ్యంలో ట్రాఫిక్ జామ్ అయింది. ఎంత సేపటికీ ఆటో కదలకపోవడంతో ఆటోలోని ముగ్గురు వ్యక్తులూ కిందకు దిగారు. అప్పుడే దగ్గరలోని చెట్టు మీద ఉన్న ఒక కోతి దిగిన వారిలో ఒక వ్యక్తి చేతిలో ఉన్న టవల్‌ను లాక్కెళ్లింది. దానిలో తినడానికి ఏమైనా ఉందనుకుందో ఏమో గట్టిగా విదిలించింది.

Android Apps : మొబైల్ యూజర్లకు గూగుల్ వార్నింగ్.. వెంటనే ఈ 26 యాప్స్ డిలీట్ చేయండి..

అంతే మూటలోని డబ్బు రోడ్డుపై చిందర వందరగా పడ్డాయి. ఇంకేముంది ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయిన వారిలో చాలా మంది ఆ డబ్బు కోసం ఎగబడ్డారు. కొందరు నిజాయితీ పరులు డబ్బు సేకరించి యజమానికి తిరిగిచ్చారు. కానీ చివరకు అతని చేతికి రూ.56 వేలు మాత్రమే దక్కాయి. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో డబ్బు ఎవరు తీసుకున్నదీ తెలుసుకోవడం కుదరలేదని చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు