WhatsApp Down : పని చేయని వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా.. కారణం అదేనా? చైనా పనేనా?

భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో సోషల్ మీడియా సేవలకు అంతరాయం ఏర్పడింది. వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ఉన్నట్టుండి ఒక్కసారిగా నిలిచిపోయాయి. కొన్ని గంటల పాటు వీటి సేవలు

WhatsApp Down : పని చేయని వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా.. కారణం అదేనా? చైనా పనేనా?

Whatsapp Down Cyber Attack

WhatsApp Down : భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో సోషల్ మీడియా సేవలకు అంతరాయం ఏర్పడింది. వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ఉన్నట్టుండి ఒక్కసారిగా నిలిచిపోయాయి. కొన్ని గంటల పాటు వీటి సేవలు నిలిచిపోవడం అందరికీ షాక్ ఇచ్చింది. యూజర్లు విలవిలలాడిపోతున్నారు. కాగా, ఈ వ్యవహరం హాట్ టాపిక్ గా మారింది. అత్యంత సెక్యూర్డ్ గా ఉండే ఈ సోషల్ మీడియా నెట్ వర్క్స్ ఇంతసేపు నిలిచిపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. వీటిపై సైబర్ అటాక్ జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. అంతేకాదు ఇది చైనా పనే అన్న అనుమానం వ్యక్తం చేసింది అమెరికన్ ఇంటెలిజెన్స్. మరోవైపు సాంకేతిక సమస్యలే కారణం అని ఎఫ్బీ చెబుతోంది.

Android Apps : మొబైల్ యూజర్లకు వార్నింగ్.. వెంటనే ఈ 26 యాప్స్ డిలీట్ చేయండి..

వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ మెసెంజర్ నిలిచిపోయాయి. ఈ మూడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు ఫేస్ బుక్ కు చెందినవే. నెటిజన్లకు తీవ్ర అసౌకర్యం ఏర్పడడం పట్ల ఫేస్ బుక్ వెంటనే స్పందించింది. క్షమించాలి… ఏదో ఇబ్బంది ఏర్పడింది. మా నిపుణులు లోపాన్ని గుర్తించి సరిదిద్దేందుకు శ్రమిస్తున్నారు. వీలైనంత త్వరలో సేవలు పునరుద్ధరిస్తాం అని ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, సోషల్ మీడియా యూజర్లు దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ట్విట్టర్ ను ఆశ్రయించారు.

Flubot Malware : సెక్యూరిటీ అప్‌డేట్ అని మేసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త.. క్లిక్ చేస్తే ఖతమే

వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్‌బుక్ సేవలకు అంతరాయం ఏర్పడినట్లు సోమవారం రాత్రి 9 గంటల సమయంలో యూజర్లు ట్విట్టర్ లో సందేశాలను పోస్ట్ చేశారు. భారత్ లో ఫేస్‌బుక్ సంస్థకు 410 మిలియన్లకు పైగా యూజర్లు ఉన్నారు. అలాగే, వాట్సప్ మెసెంజర్ కు 530 మిలియన్ల యూజర్లు, ఇన్ స్టాగ్రామ్ కు 210 మిలియన్లకు పైగా యూజర్లు ఉన్నారు.