Flubot Malware : సెక్యూరిటీ అప్‌డేట్ అని మేసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త.. క్లిక్ చేస్తే ఖతమే

సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు తెగబడుతున్నారు. ఆండ్రాయిడ్ యూజర్లు టార్గెట్ గా మాల్ వేర్ తో నిండా ముంచేస్తున్నారు. తాజాగా సైబర్ క్రిమినల్స్ ఫ్లూబ

Flubot Malware : సెక్యూరిటీ అప్‌డేట్ అని మేసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త.. క్లిక్ చేస్తే ఖతమే

Flubot Malware

Flubot Malware : సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు తెగబడుతున్నారు. ఆండ్రాయిడ్ యూజర్లు టార్గెట్ గా మాల్ వేర్ తో నిండా ముంచేస్తున్నారు. తాజాగా సైబర్ క్రిమినల్స్ ఫ్లూబోట్ మాల్వేర్ తో బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఫేక్ సెక్యూరిటీ అప్ డేట్స్ పేరుతో దగా చేస్తున్నారు.

ఫ్లూబోట్ మాల్వేర్ మళ్లీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ వినియోగదారుల ఫోన్లకు సంక్రమిస్తోంది. వినియోగదారుల పరికరాల్లోకి ప్రవేశించడానికి మాల్వేర్ ఒక కొత్త మార్గాన్ని కనుగొంది. ఒక నెల క్రితం భద్రతా సంస్థ ట్రెండ్ మైక్రో, న్యూజీలాండ్ కు చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్‎టీ) ప్రమాదకరమైన ఫ్లూబోట్ మాల్ వేర్ మరో కొత్త పద్దతిలో తిరిగి వచ్చినట్లు వినియోగదారులను హెచ్చరిస్తోంది. మొబైల్ యూజర్లను ఆకర్షించడం కోసం పార్శిల్‌ పేరుతో ఓ టెక్ట్స్ మెసేజ్ వస్తోంది. యూజర్లు లింక్ పై క్లిక్ చేసిన తర్వాత వారికి మరో పెద్ద సందేశం వస్తుంది.

Google ban: జాగ్రత్త! మీ ఫోన్‌లో ఈ 136 డేంజరస్ యాప్‌లు ఉంటే, బ్యాంకు అకౌంట్‌లో డబ్బులు పోవచ్చు

మీ మొబైల్/కంప్యూటర్ కి ప్రమాదకరమైన ఫ్లూబోట్ మాల్వేర్ సోకినట్లు ఒక హెచ్చరిక చేస్తుంది. వాస్తవానికి, ఇది గూగుల్ క్రోమ్ ప్రమాదకరమైన సేఫ్ బ్రౌజింగ్ సందేశాన్ని తెలిపే రెడ్ హెచ్చరిక స్క్రీన్’ తో పోలి ఉంటుంది. “ఫ్లూబోట్ మాల్వేర్ తొలగించడం కోసం ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్ డేట్ ఇన్ స్టాల్ చేయండి” అని సందేశం రూపంలో ఇక్కడ క్లిక్ చేయండి చూపిస్తుంది.

ఫ్లూబోట్ మాల్ వేర్ మాల్వేర్ తొలగించడం కోసం నిజమైన సెక్యూరిటీ అప్ డేట్ చేయడానికి బదులుగా వినియోగదారులు తమ స్మార్ట్ ఫోన్ లో ఫ్లూబోట్ వైరస్ డౌన్ లోడ్ చేస్తారు. సెక్యూరిటీ అప్ డేట్ పేరుతో మీ మొబైల్స్ లో ప్రవేశించిన తర్వాత ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్, యాప్‌ ఆధారిత బ్యాంకింగ్, డిజిటల్‌ పేమెంట్స్‌, ఈ-మెయిల్, ట్విట్టర్‌ ఈ డేటా మొత్తాన్ని మాల్‌వేర్‌ ప్రయోగించిన సైబర్‌ నేరగాడికి ఫ్లూబోట్‌ అందిస్తుంది. అలాగే, మీ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్ ద్వారా ఇతర వ్యక్తులకు పంపుతుంది.

Amazon Festival Sale : స్మార్ట్ ఫోన్లు, టీవీలపై భారీ డిస్కౌంట్లు.. ప్రైమ్ యూజర్లకు బెనిఫిట్స్!

ప్రమాదకరమైన ఫ్లూబోట్ నుంచి రక్షించుకోవాలంటే..
* స్క్రీన్ పై వచ్చే పాప్ అప్ క్లిక్ చేయవద్దు.
* ఏ ఇతర లింక్స్‌ ద్వారా వచ్చే యాప్‌లు సురక్షితం కావు.
* తెలిసిన వ్యక్తే కదా పంపించాడు అనుకుని ఎప్పుడూ లింక్స్‌ ఓపెన్ చేయకూడదని.
* ఒకవేళ పొరపాటున డౌన్‌లోడ్‌ చేసి ఉంటే వెంటనే మొబైల్‌ను ఫ్యాక్టరీ రీసెట్‌ చేయాల్సి ఉంటుంది.

ఒకవేళ యూజర్లు నకిలీ లింక్ చేసినా డౌన్ లోడ్ చేసుకుని ఉండకపోతే ఫ్లూబోట్ ఇన్ ఫెక్షన్ ప్రమాదం లేనట్టే అని నిపుణులు తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో యూజర్లు తమ ఆన్ లైన్ అకౌంట్ల పాస్ వర్డులు తప్పనిసరిగా మార్చుకోవాలి. అంతేకాదు తమ బ్యాంకు అధికారులను సంప్రదించాలి(క్షేమం కోసం). అలాగే పేమెంట్ కార్డు వివరాలు కూడా మార్చుకోవాలి.

ఫ్లూబోట్ అంటే..
* ఇదొక బ్యాంకింగ్ ట్రోజన్
* బ్యాంకు ఖాతా వివరాలు, క్రెడిట్ కార్డు సమాచారం, కాంటాక్ట్స్ వివరాలను సర్వర్ కు అప్డేట్ చేస్తుంది
* ఒక వేళ ఫోన్ కానీ ప్రమాదకర యాప్ తో ఇన్ ఫెక్ట్ అయ్యిందంటే ఆర్థికంగా నష్టపోక తప్పదు.
* మలీషియస్ యాప్ అటోమేటిక్ గా టెక్ట్స్ మేసేజ్ లు పంపేస్తుంది.

Flubot Malware, Androids, Fake Security Updates, banking trojan, malicious apps, cyber criminals