నక్సల్స్ దాడి వెనుక రాజకీయ కుట్ర

చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో మంగళవారం నక్సల్స్ జరిపిన IED బ్లాస్ట్ లో మరణించిన బీజేపీ ఎమ్మెల్యే భీమ మండవి మృతదేహాన్ని గడపాల్ లోని ఆయన నివాసానికి బుధవారం (ఏప్రిల్-10,2019) తరలించారు.

చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో మంగళవారం నక్సల్స్ జరిపిన IED బ్లాస్ట్ లో మరణించిన బీజేపీ ఎమ్మెల్యే భీమ మండవి మృతదేహాన్ని గడపాల్ లోని ఆయన నివాసానికి బుధవారం (ఏప్రిల్-10,2019) తరలించారు.

చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో మంగళవారం నక్సల్స్ జరిపిన IED బ్లాస్ట్ లో మరణించిన బీజేపీ ఎమ్మెల్యే భీమ మండవి మృతదేహాన్ని గడపాల్ లోని ఆయన నివాసానికి బుధవారం (ఏప్రిల్-10,2019) తరలించారు. భీమ కుటుంబసభ్యులు, బంధువులు, మద్దతుదారులు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు.
Read Also : ముద్దంటూ కొరికేశాడు : 300ల కుట్లు..12 ఏళ్ల జైలు

చత్తీస్ ఘడ్ మాజీ సీఎం రమణ్ సింగ్ భీమ భౌతికకాయానికి నివాళులర్పించారు. భీమ కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరణం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని రమణ్ సింగ్ అన్నారు.దాడి ఘటనపై దర్యాప్తు జరగాలన్నారు.

నక్సలైట్లు జరిపిన బ్లాస్ట్ లో బీజేపీ ఎమ్మెల్యే భీమ మండవి, అతని కారు డ్రైవర్, ముగ్గురు వ్యక్తిగత సిబ్బంది మరణించారు. నక్సల్స్ దాడిని ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా తీవ్రంగా ఖండించారు. నక్సల్స్ దాడిలో మరణించిన ఎమ్మెల్యే భీమ మండవి అంకితభావం కలిగిన బీజేపీ కార్యకర్త అని మోడీ అన్నారు.

Read Also : మాయ చేయొద్దు : మోడీ మూవీకి ఈసీ బ్రేక్