Bihar Crime: బతికుండగానే మూడేళ్ల బాలికను శ్మశానంలో పాతిపెట్టిన తల్లి.. గ్రామస్తులు ఏం చేశారంటే..
బీహార్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తల్లి, అమ్మమ్మ కలిసి మూడేళ్ల బాలికను శ్మశాన వాటికలో పూడ్చిపెట్టి సజీవదహనం చేసేందుకు ప్రయత్నించారు. గ్రామస్తులు గమనించి బాలికను కాపాడారు.
- Harishth Thanniru
- Published On : July 13, 2022 / 08:03 AM IST
Girl
Bihar Crime: బీహార్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తల్లి, అమ్మమ్మ కలిసి మూడేళ్ల బాలికను శ్మశాన వాటికలో పూడ్చిపెట్టి సజీవదహనం చేసేందుకు ప్రయత్నించారు. గ్రామస్తులు గమనించి బాలికను కాపాడారు. ఈ ఘటన విహార్ లోని సరన్ జిల్లా కోపా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Kadem Project: ప్రమాదపుటంచున కడెం ప్రాజెక్టు.. రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు
లాలీ అనే మూడేళ్ల బాలికను ఆమె తల్లి, అమ్మమ్మ సజీవంగా హతమార్చేందుకు ప్రయత్నించారు. బాలిక నోట్లో మట్టికుక్కి శ్మశానానికి తీసుకెళ్లారు. అక్కడ గోతితీసి దానిలో పాతిపెట్టారు. శ్మశాన వాటిక నుంచి అరుపులు విన్న గ్రామస్తులు, ఇది దెయ్యం అని భావించి భయాందోళనకు గురయ్యారు. కాని తరువాత ఎవరో సజీవంగా పాతిపెట్టారని గ్రహించారు. వారు మట్టిని తొలగించి చూడగా నోటిలో మట్టితో ఉన్న బాలికను గుర్తించారు. వెంటనే బాలికను బయటకు తీసి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
NASA: విశ్వరూపం అద్భుతం.. వెలుగులోకి 1300 కోట్ల ఏళ్ల నాటి అద్భుత దృశ్యాలు
అసలు విషయంపై బాలికను పోలీసులు ఆరా తీయగా.. తన తండ్రి పేరు రాజు శర్మ, తల్లి పేరు రేఖా దేవీ అని తెలిపింది. అమ్మమ్మ, అమ్మ తనను బయటకు వెళ్దామని చెప్పి తీసుకెళ్లారని, శ్మశానం వద్దకు తీసుకెళ్లి నా నోట్లో మట్టిని నింపి గుంతలో పాతిపెట్టారని బాలిక తెలిపింది. బాలిక కుటుంబ సభ్యులకోసం పోలీసులు గాలిస్తున్నారు.
