Biryani Watermelon Death: రాత్రి బిర్యానీ.. అర్థరాత్రి ఒంటి గంటకు పుచ్చకాయ తిన్నారు.. కట్ చేస్తే నలుగురు మృతి.. అసలేం జరిగింది
Biryani Watermelon Death: బిర్యానీ, పుచ్చకాయ తిని ఒకే కుటుంబంలో నలురుగు చనిపోయిన సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది
- Dharani Pilli
- Updated on- April 28, 2026 / 05:23 PM IST
Mumbai four family members died after eating biryani watermelon
- ముంబైలో తీవ్ర విషాదం
- బిర్యానీ, పుచ్చకాయ తిని
- ఒకే కుటుంబంలో నలుగురు మృతి
Biryani Watermelon Death: ఆ కుటుంబం అంతా బంధువుల ఇంటికి వెళ్లి సరదాగా గడిపారు. రాత్రి విందు చేసుకున్నారు. బిర్యానీ తిని ఇంటికి వచ్చారు. ఆ తర్వాత అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కుటుంబ సభ్యులంతా పుచ్చకాయ తిన్నారు. మరి ఏం జరిగిందో తెలియదు కానీ, కేవలం 12 గంటల వ్యవధిలోనే ఆ కుటుంబంలోని నలుగురు చనిపోయారు. ఈ సంఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. మహారాష్ట్రలో ఈ దారుణం వెలుగు చూసింది. చనిపోయిన వారిలో 13 ఏళ్ల బాలిక కూడా ఉంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలో నివాసం ఉండే అబ్దుల్లా కాదర్ (40) స్థానికంగా మొబైల్ దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అతడి భార్య నస్రీన్ (35). వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. ఈ క్రమంలో శనివారం రాత్రి అబ్దుల్లా కాదర్.. తన భార్య బిడ్డలతో కలిసి బంధువులు నిర్వహించిన విందుకు వెళ్లారు. అక్కడ బిర్యానీ ఆరగించారు. ఆ తర్వాత ఇంటికి వచ్చారు. ఆపై అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పుచ్చకాయ తిన్నారు.
Also Read: పిల్లలతో కలిసి ఫుట్ బాల్ ఆడుతున్న పీఎం నరేంద్ర మోదీ..
మరి ఏం జరిగిందో తెలియదు కానీ.. ఆదివారం ఉదయం 5 గంటల సమయం నుంచి అబ్దుల్లా కాదర్ కుటుంబంలోని అందరికీ వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. ఈ పరిస్థితి చూసి భయపడ్డ అబ్దుల్లా వెంటనే స్థానికంగా ఉన్న డాక్టర్‌ని పిలిచారు. కానీ అప్పటికే వారి పరిస్థితి విషమంగా మారింది. దీంతో కుటుంబాన్ని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో అబ్దుల్లా కాదర్ కుటుంబంలోని నలుగురూ మృతి చెందారు. దీంతో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఫుడ్ పాయిజనింగ్ కారణం అయ్యుండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
