Maharashtra : మహారాష్ట్రలో విషాదం.. కొండచరియలు విరిగిపడి 12 మంది మృతి
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని చెంబూరులో విషాదం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగి ఇళ్లపై పడడంతో 12 మంది మృతి చెందారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు.
- kunduru Vinod
- Updated on- July 18, 2021 / 10:44 AM IST
Maharashtra (4)
Maharashtra : మహారాష్ట్ర రాజధాని ముంబైలోని చెంబూరులో విషాదం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగి ఇళ్లపై పడడంతో 12 మంది మృతి చెందారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు.
భరత్ నగర్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ దళాలు శిథిలాల నుంచి 16 మందిని రక్షించాయి.
శిథిలాల కింద గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. కాగా, ముంబైలోని విక్రోలీ ప్రాంతంలో ఓ భవనం కూలిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఇక్కడ కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
