Covid Cases In Mumbai : ముంబైలో రోజురోజుకీ పెరిగిపోతున్న కోవిడ్ కేసులు
దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
- venkaiahnaidu
- Published On : January 4, 2022 / 09:22 PM IST
Covid (2)
Covid Cases In Mumbai : దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వేలాదిగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా కోవిడ్ ఫస్ట్,సెకండ్ వేవ్ లో భారీగా కేసులు నమోదైన మహారాష్ట్రలో మళ్లీ ఇప్పుడు భారీగా కేసులు నమోదవుతున్నాయి.
మహారాష్ట్రలో మొత్తంగా నమోదవుతున్న కేసుల్లో సగానికి పైగా కేసులు ఒక్క ముంబైలోనే నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఇవాళ 18,466 మందికి కరోనా వైరస్ సోకగా, 20 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇందులో 10 వేల 860 కేసులు,2 మరణాలు ఒక్క ముంబైలోనే నమోదయ్యాయి. సోమవారం ముంబైలో నమోదైన కోవిడ్ కేసుల కంటే ఇవాళ 34శాతం అత్యధికంగా కేసులు నమోదయ్యాయి.
ఇక,మహారాష్ట్రలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 653కు చేరింది. దేశంలో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల్లో అత్యధిక కేసులు నమోదైంది కూడా మహారాష్ట్రలోనే.
ALSO READ Yogi Retorts To Akhilesh : అఖిలేష్ “రామ రాజ్యం”వ్యాఖ్యలకు యోగి కౌంటర్
