MV Ganga Vilas: గంగా క్రూయిజ్‌పై సంచలన ఆరోపణలు చేసిన అఖిలేష్ యాదవ్
యోగి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న ఈ క్రూయిజ్ మీద సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. అందులో బార్ ఉందని, ప్రయాణికులకు మద్యం అందిస్తున్నారని అఖిలేష్ ఆరోపించారు. ఈ విషయాన్ని తనకు అందులో ప్రయాణించిన వారే చెప్పారని ఆయన పేర్కొన్నారు
- tony bekkal
- Updated on- January 14, 2023 / 09:17 PM IST
I've heard it has bars that serve alcohol: Akhilesh Yadav on Ganga Vilas cruise
MV Ganga Vilas: ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్ గంగా విలాస్‌ను శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ వీడియో లింక్ ద్వారా వారణాసిలో జెండాఊపి ప్రారంభించారు. వారణాసి నుంచి ప్రారంభమైన ఈ రివర్ క్రూయిజ్ బంగ్లాదేశ్, ఇండియాలోని 27 నదుల్లో పర్యటిస్తుంది. 51 రోజులు ప్రయాణంలో 3,200 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. భారతీయ, అంతర్జాతీయ డిజైన్లతో ఈ క్రూయిజ్ ను నిర్మించారు. ఈ ఆధునిక నౌక 62 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. తొలి ప్రయాణంలో స్విట్జర్లాండ్ నుండి 32 మంది పర్యాటకులు ఇందులో ప్రయాణించారు.
కాగా, యోగి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న ఈ క్రూయిజ్ మీద సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. అందులో బార్ ఉందని, ప్రయాణికులకు మద్యం అందిస్తున్నారని అఖిలేష్ ఆరోపించారు. ఈ విషయాన్ని తనకు అందులో ప్రయాణించిన వారే చెప్పారని ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ “క్రూయిజ్‌లో ప్రయాణం గురించి విన్నాను. పవిత్రమైన గంగా నదిలో మద్యం అందించే బార్‌లు అందులో ఉన్నట్లు తెలిసింది. అందులో ప్రయాణించిన వారే నాకు చెప్పారు” అని అన్నారు.
Drunk Naked Man In Local Train : ఛీ ఛీ.. రైలులో దుస్తులన్నీ విప్పేసి మందుబాబు హల్ చల్
