Drunk Naked Man In Local Train : ఛీ ఛీ.. రైలులో దుస్తులన్నీ విప్పేసి మందుబాబు హల్ చల్

లోకల్ ట్రైన్ లో మందుబాబు హల్ చల్ చేశాడు. ఒంటి మీదున్న దుస్తులన్నీ తీసేసిన అతడు కేవలం అండర్ వేర్ మాత్రమే ఉంచుకున్నాడు. లోకల్ ట్రైన్ లో ఫ్లోర్ పై పడుకున్నాడు. మందుబాబు నిర్వాకంతో తోటి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.

Drunk Naked Man In Local Train : ఛీ ఛీ.. రైలులో దుస్తులన్నీ విప్పేసి మందుబాబు హల్ చల్

Updated On : January 14, 2023 / 7:59 PM IST

Drunk Man In Local Train : మందుబాబులు రెచ్చిపోతున్నారు. పీకల దాకా తాగేసి రచ్చ చేస్తున్నారు. మద్యం మత్తులో తాము ఎక్కడ ఉన్నాము? ఏం చేస్తున్నాం? అనేది వారికే తెలియడం లేదు. తమ విపరీత చర్యలతో జనాలను పరేషాన్ చేస్తున్నారు. కామన్ సెన్స్ లేని పనులతో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు.

తాజాగా ముంబై లోకల్ ట్రైన్ లో మందుబాబు హల్ చల్ చేశాడు. ఒంటి మీదున్న దుస్తులన్నీ తీసేసిన అతడు కేవలం అండర్ వేర్ మాత్రమే ఉంచుకున్నాడు. లోకల్ ట్రైన్ లో ఫ్లోర్ పై పడుకున్నాడు. మందుబాబు నిర్వాకంతో తోటి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.

Also Read..Viral Video: రైల్వే స్టేషన్‌లో మహిళ ప్రాణాలు కాపాడిన జవాను, ప్రయాణికుడు

ముంబై లోకల్ రైల్లో ఈ ఘటన జరిగింది. లోకల్ ట్రైన్ ప్రయాణికులతో రద్దీగా ఉంది. ఎటు నుంచి వచ్చాడో, ఎప్పుడు ఎంట్రీ ఇచ్చాడో కానీ.. ఓ తాగుబోతు ప్రయాణికుల మధ్యలోకి వచ్చేశాడు. ఆ తాగుబోతు చేసిన పనికి తోటి ప్రయాణికులు షాక్ అయ్యారు. ఆ వ్యక్తికి కిక్కు బాగా ఎక్కేసిందో ఏమో కానీ, ఒంటి మీదున్న దుస్తులన్నీ తీసేశాడు. కేవలం అండర్ వేర్ మాత్రమే ఉంచుకున్నాడు. అలానే ఫ్లోర్ పై నిద్రపోయాడు. అతడు ఎంతగా తాగేశాడంటే.. స్పృహలో లేడు.

Also Read..Viral Video: మెట్రో రైల్లో ఊగుతూ, డ్యాన్స్ చేస్తూ అమ్మాయి రచ్చ రచ్చ

తోటి ప్రయాణికులు అతడికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. కానీ, అతడు వినిపించుకునే స్థితిలో లేడు. దీన్ని ఓ వ్యక్తి మొబైల్ లో వీడియో తీశాడు. సోషల్ మీడియాలో వీడియోని అప్ లోడ్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.