Viral Video: రైల్వే స్టేషన్‌లో మహిళ ప్రాణాలు కాపాడిన జవాను, ప్రయాణికుడు

Viral Video: ‘కదుతున్న రైలు ఎక్కకూడదు, దాని నుంచి దిగకూడదు’ అని రైల్వే శాఖ ఎంతగా అవగాహన కల్పిస్తున్నా ఆ పనే చేస్తూ కొందరు ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. తాజాగా, మహారాష్ట్ర రాజధాని ముంబైలోని దాదార్ రైల్వే స్టేషన్ లో చోటుచేసుకుంది. ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చుకుంది. కదులుతున్న రైలును ఎక్కబోయిన ఓ మహిళ రైలు, ప్లాట్‌ఫాం మధ్యలో ఉండే ఖాళీలో పడిపోబోయింది.
ఈ విషయాన్ని గుర్తించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కు చెందిన ఓ జవాను, ఓ ప్రయాణికుడు వెంటనే స్పందించి ఆమెను లాగారు. దీంతో ఆ మహిళ ప్లాట్‌ఫాంపై పడిపోయింది. ఆమెకు ప్రాణాపాయం తప్పింది. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. గతంలోనూ రైల్వే స్టేషన్లలో చాలా సార్లు ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
అయినప్పటికీ ప్రయాణికులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. కాగా, సంక్రాంతి పండుగ సందర్భంగా రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటోంది. దీంతో చాలా మంది ప్రయాణికులు తమకు రైళ్లలో సీట్లు, కనీసం నిల్చోవడానికి చోటు ఉండదన్న ఆందోళనలో ట్రైను ఆగకముందే ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు.
#WATCH | Maharashtra: An RPF (Railway Protection Force) jawan, and a passenger, save a woman’s life after she fell on the platform while trying to board a moving train at Dadar Railway Station in Mumbai.
(Video: CCTV footage) pic.twitter.com/W473de67U1
— ANI (@ANI) January 14, 2023
AP CM YS Jagan: సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న ఏపీ సీఎం జగన్ దంపతులు