Video Of Naked Foreigner : బాబోయ్.. దుస్తులు విప్పేసి పచ్చి బూతులు తిడుతూ సిబ్బందిపై దాడి.. ఫైవ్ స్టార్ హోటల్‌లో మహిళ రచ్చ రచ్చ
నగ్నంగా రూమ్ నుంచి బయటకు వచ్చిన ఆమె.. వీరంగం సృష్టించింది. పెద్ద పెద్దగా అరుస్తూ గోల గోల చేసింది. హోటల్ స్టాఫ్ ని బండ బూతులు తిట్టింది. దాడి కూడా చేసింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.(Video Of Naked Foreigner)
- Naveen
- Published On : December 17, 2022 / 09:27 PM IST
Video Of Naked Foreigner : రాజస్తాన్ జైపూర్ లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ఓ విదేశీ మహిళ రచ్చ రచ్చ చేసింది. నగ్నంగా రూమ్ నుంచి బయటకు వచ్చిన ఆమె.. వీరంగం సృష్టించింది. పెద్ద పెద్దగా అరుస్తూ గోల గోల చేసింది. హోటల్ స్టాఫ్ ని బండ బూతులు తిట్టింది. అంతేనా.. దాడి కూడా చేసింది. ఇదంతా ఫోన్ లో రికార్డ్ చేయగా.. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అది జైపూర్ లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్. ఓ విదేశీ మహిళ అక్కడ బస చేసింది. ఏం జరిగిందో తెలియదు కానీ.. ఆమె దుస్తులన్నీ విప్పేసి తన రూమ్ నుంచి బయటకు వచ్చింది. హోటల్ స్టాఫ్ పై కోపంతో ఊగిపోయింది. గట్టి గట్టిగా అరుస్తోంది. అంతేకాదు వారిని పచ్చి బూతులు తిట్టింది.
ఆ మహిళకు నచ్చ చెప్పేందుకు, ఆమెని శాంతింపజేసేందుకు స్టాఫ్ తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, ప్రయోజనం లేకపోయింది. ఆమె అస్సలు ఊరుకోలేదు. మరింతగా రెచ్చిపోయింది.
నగ్నంగా ఉన్న ఆ మహిళ చాలా కోపంగా ఉంది. సిబ్బందిపై దాడి చేసింది. సర్ది చెప్పబోయిన ఓ మహిళా సిబ్బంది జట్టు పట్టుకుని లాగి చితక్కొట్టింది. దుస్తులు విప్పేసి రూమ్ బయటకు వచ్చి బూతులు తిడుతూ దాడికి పాల్పడిన విదేశీ మహిళ తీరుతో హోటల్ సిబ్బంది బిత్తరపోయారు. ఆ మహిళ తీరుతో విసిగిపోయిన సిబ్బంది పోలీసులకు ఫోన్ చేశారు.
ఎందుకో తెలియదు కానీ.. ఆ విదేశీ మహిళ.. హోటల్ సిబ్బందిపై చాలా కోపంగా ఉంది. సిబ్బంది పని తీరు పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నట్లు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. మొత్తంగా దుస్తులన్నీ విప్పేసి ఆ విదేశీ మహిళ చేసిన వీరంగం వీడియో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. వామ్మో.. అని అంతా బిత్తరపోతున్నారు. ఆమె తీరుని నెటిజన్లు తప్పుపడుతున్నారు. ఏదైనా సమస్య ఉంటే, మాట్లాడి పరిష్కరించుకోవాలి. అంతే కానీ, ఇలా దుస్తులు విప్పేసి సిబ్బందిని బూతులు తిడుతూ దాడి చేయడం ఎంతమాత్రమూ కరెక్ట్ కాదంటున్నారు. ముమ్మాటికీ ఆమె చేసింది తప్పే అంటున్నారు.
ON CAMERA: Naked foreigner woman thrashes hotel staff in Jaipur; claims mistreatment pic.twitter.com/usjTYDa2pM
— Free Press Journal (@fpjindia) December 17, 2022
