NEET UG Re-Exam 2026: ఇండియాలో ఎగ్జామ్ కి దుబాయ్ లో సెంటర్.. కంగుతిన్న విద్యార్ధి.. హెల్ప్ లైన్ కి కాల్ చేస్తే ఏమన్నారంటే?

నాగ్‌పూర్‌కు చెందిన అబ్దుల్లా మహ్మద్ తాలిబ్ అనే విద్యార్థికి అబుదాబిలో పరీక్షా కేంద్రాన్ని (Neet Re Exam 2026)కేటాయించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

neet ug re exam 2026 nta allocated abu dhabi center to nagpur student

  • నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబిలో సెంటర్.
  • పాస్‌పోర్ట్ లేకపోవడంతో విద్యార్థి తీవ్ర ఆందోళన.
  • కొత్త అడ్మిట్ కార్డ్ ఇస్తామని ఎన్‌టీఏ హామీ.

NEET Re Exam 2026: ఇండియాలో ఎగ్జామ్స్ కి దుబాయ్ లో సెంటర్ పడితే ఎలా ఉంటుంది. అవాక్కయ్యారు కదా. ఇదే సిచువేషమ్ ఇప్పుడు నాపూర్ లోని ఒక నీట్ విద్యార్థికి వచ్చింది. నీట్-యూజీ (Neet UG Re Exam) రీ-ఎగ్జామ్ అడ్మిట్ కార్డుల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) చేసిన ఘోర తప్పిదం వల్ల ఓ విద్యార్థి మానసిక వేదనకు గురయ్యాడు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన అబ్దుల్లా మహ్మద్ తాలిబ్ అనే విద్యార్థికి ఏకంగా అబుదాబిలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

*Kalyanalakshmi Scam: 2023లో చనిపోయిన వ్యక్తికి 2024లో పెళ్లి.. ‘కల్యాణ లక్ష్మి’ కూడా అప్లై చేశారు.. చివరికి ఏం జరిగిందో తెలుసా?

జూన్ 21న జరగనున్న నీట్ రీ-ఎగ్జామ్ కోసం శుక్రవారం సాయంత్రం 4 గంటలకు అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోగా, అందులో పరీక్షా కేంద్రం అబుదాబిలోని ఒక స్కూల్ అని ఉండటంతో విద్యార్థి కుటుంబం షాక్‌కు గురిచేసింది. తాము ఎంపిక చేసిన ఆప్షన్లలో అసలు అబుదాబి పేరునే పెట్టలేదని విద్యార్థి తండ్రి మహ్మద్ తాలిబ్ తెలిపారు. వెంటనే ఎన్‌టీఏ హెల్ప్‌లైన్‌ను సంప్రదించగా, మెయిల్ పంపాలని సూచించారని.. శనివారం సాయంత్రం 4 గంటల కల్లా కొత్త అడ్మిట్ కార్డ్ ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.

ఈ ఊహించని తప్పిదంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన అబ్దుల్లా నిన్న రోజంతా కన్నీరు పెట్టుకున్నాడని, పరీక్ష రాయనని మొండికేయగా తల్లి నచ్చజెప్పిందని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. అసలు తమ కుమారుడికి పాస్‌పోర్ట్ కూడా లేదని ఆయన వెల్లడించారు. తాము పరీక్ష కోసం 3 జిల్లాలను ఆప్షన్లుగా ఇచ్చామని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వేరే జిల్లాకు వెళ్లే సమయం కూడా లేనందున నాగ్‌పూర్‌లోనే పరీక్షా కేంద్రాన్ని కేటాయించాలని సదరు కుటుంబం అధికారులను డిమాండ్ చేస్తోంది.