Speed Post New Rules : ఆగస్ట్ 1 నుంచి స్పీడ్ పోస్ట్ కొత్త రూల్స్.. ఏవి డాక్యుమెంట్స్? ఏవి పార్శిల్స్? కొత్త ఛార్జీలు ఎంతంటే..

Speed Post Rules : స్పీడ్ పోస్టు పంపించేవారు తప్పక తెలుసుకోండి. ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఛార్జీలు కూడా మారాయి. దేనికి ఎంతంటే? ఫుల్ డిటెయిల్స్

Speed Post Rules

  • ఆగస్ట్ 1 నుంచి స్పీడ్ పోస్ట్ ఖర్చు మారనుందా?
  • మీ పార్శిల్‌పై ఎంత ఛార్జీ పడుతుంది?
  • స్పీడ్ పోస్ట్ పంపే ముందు తప్పక తెలుసుకోండి

Speed Post New Rules : స్పీడ్ పోస్టు చేసేవారికి బిగ్ అలర్ట్.. ఆగస్టు 1 నుంచి కొత్త గైడ్ లైన్స్ అమల్లోకి రానున్నాయి. స్పీడ్ పోస్ట్ సేవలకు సంబంధించి ఇండియా పోస్ట్ (India Post) కొత్త నిబంధలను అమలు చేయనుంది. ఇందులో భాగంగా ప్రత్యేకించి డాక్యుమెంట్లు, పార్శిల్స్ కేటగిరీపై వినియోగదారులకు క్లారిటీ ఇచ్చింది. బల్క్ యూజర్ల కోసం కొత్త ఛార్జీలను కూడా ప్రకటించింది. అయితే సాధారణ (రిటైల్) యూజర్లకు మాత్రం ప్రస్తుత స్పీడ్ పోస్ట్ టారిఫ్‌లో పెద్దగా మార్పులు లేవని పోస్టల్ శాఖ వెల్లడించింది.

డాక్యుమెంట్లు ఇవే :
కొత్త నిబంధనల ప్రకారం.. కమర్షియల్ వాల్యూ లేని వస్తువులన్నీ డాక్యుమెంట్స్ కేటగిరీలోకి వస్తాయి. ఉత్తరాలు, ప్రింటెడ్ డాక్యుమెంట్లు, అధికారిక డాక్యుమెంట్లు, వెల్‌కమ్ కిట్లు, బ్యాంక్ పాస్‌బుక్‌లు, స్టేట్‌మెంట్లు, డెబిట్, క్రెడిట్ కార్డులు, బ్యాంకుల నుంచి పంపే ఇతర డేటా డాక్యుమెంట్లు ఇందులో ఉంటాయి.

అలాగే ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ప్రభుత్వం జారీ చేసిన ఐడెంటిటీ డాక్యుమెంట్లు కూడా డాక్యుమెంట్లుగానే పరిగణిస్తారు. 500 గ్రాముల వరకు బరువున్న నాన్ కమర్షియల్ ఎన్వలప్‌లు, గ్రీటింగ్ కార్డులు, రాఖీ కవర్లు, పర్సనల్ ఉత్తరాలు కూడా డాక్యుమెంట్ కేటగిరీలోకి వస్తాయి.

ఇకపై పార్శిల్స్ ఇవే :

ఇదిలా ఉండగా, అమ్మకానికి ఉద్దేశించిన వస్తువులు, కమర్షియల్ వాల్యూ ప్రొడక్టులు, సరుకులు ఇకపై పార్శిల్స్‌గా పరిగణిస్తారు. పంపే వస్తువులను బట్టి సరైన కేటగిరీని ఎంచుకోవాలి. 24 గంటల స్పీడ్ పోస్ట్ సర్వీసులో 50 గ్రాముల వరకు డాక్యుమెంట్లు పంపేందుకు లొకేషన్ డెలివరీకి రూ.38 చెల్లించాలి.

Read Also : Price Hike August 2026 : సామాన్యులకు బిగ్ షాక్..! ఆగస్టులో టీ నుంచి టీవీ వరకు.. కారు నుంచి మొబైల్ వరకు.. అన్నీ ఖరీదే!

దేశీయంగా ఇతర ప్రాంతాలకు రూ.94 (జీఎస్టీ) అదనంగా చెల్లించాలి. 51 నుంచి 250 గ్రాముల వరకు బరువున్న డాక్యుమెంట్లకు రూ.118 నుంచి రూ.154 వరకు చెల్లించాలి. అలాగే, 251 నుంచి 500 గ్రాముల వరకు బరువున్న వాటికి రూ.140 నుంచి రూ.186 వరకు ఛార్జీలు వర్తిస్తాయి. బరువు, డెలివరీ లొకేషన్ బట్టి ఛార్జీలు మారుతాయని గమనించాలి.

స్పెషల్ బల్క్ టారిఫ్ :
ఎక్కువ సంఖ్యలో మెయిల్స్ పంపే కంపెనీల కోసం స్పెషల్ బల్క్ టారిఫ్‌ను కూడా పోస్టల్ బ్రాంచ్ ప్రకటించింది. 24 గంటల స్పీడ్ పోస్ట్ సర్వీసుకు బల్క్ కస్టమర్లు కేటగిరీ, డెలివరీ లొకేషన్ బట్టి రూ.38 నుంచి రూ.100 వరకు చెల్లించాల్సి ఉంటుంది. 48 గంటల సర్వీసుకు రూ.48 నుంచి రూ.72 వరకు ఛార్జీలు చెల్లించాలి.

అదే రిటైల్ యూజర్లు 48 గంటల స్పీడ్ పోస్ట్ సర్వీసును వాడితే బరువు, డెలివరీ ప్రాంతాన్ని బట్టి రూ.61 నుంచి రూ.121 వరకు చెల్లించక తప్పదు. కొత్త నిబంధనలతో డాక్యుమెంట్లు, పార్శిల్స్ మధ్య ఉన్న తేడాను ఇకపై ఈజీగా గుర్తుపట్టొచ్చు. తద్వారా సరైన కేటగిరీని ఎంచుకుంటే అదనపు ఛార్జీల భారం తగ్గుతుంది.