NHAI: వాహనదారులకు NHAI గుడ్ న్యూస్.. అందుబాటులోకి రూ.350 లోకల్ పాస్.. ఎవరికీ వర్తిస్తుందో తెలుసా?
జాతీయ రహదారులపై తరచుగా ప్రయాణించే స్థానిక వాహనదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) తీపి కబురు అందించింది.
- V Santhosh Kumar
- Updated on- August 22, 2026 / 03:45 PM IST
Nhai launches 350 rupees digital local pass 121 toll plazas
- రూ.350కే డిజిటల్ లోకల్ పాస్
- 121 టోల్ ప్లాజాల్లో అమలు
- ఆన్‌లైన్‌లోనే సులభంగా దరఖాస్తు
NHAI: జాతీయ రహదారులపై తరచుగా ప్రయాణించే స్థానిక వాహనదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) తీపి కబురు అందించింది. టోల్ ప్లాజాల సమీపంలో నివసించే ప్రజల సౌకర్యార్థం ‘డిజిటల్ లోకల్ పాస్’ సేవలను దేశవ్యాప్తంగా 121 టోల్ ప్లాజాల వద్ద అందుబాటులోకి తీసుకొచ్చింది. టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే స్థానిక నివాసితులు ఇకపై ప్రతిసారీ పూర్తి టోల్, చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ పాస్ ద్వారా ప్రయాణించవచ్చు. కేవలం రూ.350 రుసుముతో లభించే ఈ సౌకర్యం సొంత, వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.
Gachibowli Tragedy: గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఏడంతస్తుల భవనం.. ఇద్దరు మృతి
హైవే ట్రావెల్ యాప్ ద్వారా సులభంగా ఆన్‌లైన్ దరఖాస్తు:
ఈ డిజిటల్ పాస్ కోసం అర్హులైన వాహనదారులు ఎలాంటి భౌతిక పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేకుండా హైవే ట్రావెల్ యాప్ ద్వారా నేరుగా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియలో భాగంగా డిగీ లాకర్ ద్వారా చిరునామాను, వాహన్ డేటాబేస్ ద్వారా వాహన వివరాలను, అనుసంధానమైన ఫాస్టాగ్ వివరాలను ఆన్‌లైన్‌లోనే క్షణాల్లో ధృవీకరిస్తారు. దీనివల్ల టోల్ ప్లాజా వద్దకు వెళ్లి అధికారులను కలవాల్సిన శ్రమ, సమయం రెండూ ఆదా అవుతాయి.
బ్యారియర్‌లెస్ టోలింగ్‌కు తొలి అడుగు.. ఇ-నోటీసుల సమస్యకు పరిష్కారం:
భవిష్యత్తులో అమలు చేయనున్న మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో (MLFF), బ్యారియర్‌లెస్ టోలింగ్ వ్యవస్థల్లో స్థానిక వాహనదారులకు ఎదురవుతున్న ఇ-నోటీసుల సమస్యను పరిష్కరించడంలో ఈ డిజిటల్ పాస్ అత్యంత కీలక పాత్ర పోషించనుంది. వాహనాలు బూత్‌ల వద్ద ఆగకుండా ప్రయాణించే వీలుండటంతో పాటు స్థానికులకు సులువైన చెల్లింపుల ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. స్థానిక వాహనదారులు ఎన్‌హెచ్‌ఏఐ అధికారిక యాప్ ద్వారా తమ వివరాలను సరిచూసుకుని ఈ పాస్‌ను పొందవచ్చని సూచించారు.
