Chardham Yatra: ఛార్‌ధామ్ యాత్ర ప్రత్యక్ష ప్రసారం చేయడం కుదరదు

ఛార్‌ధామ్ యాత్ర లైవ్ టెలికాస్ట్ చేయడం కుదరదని తేల్చి చెప్పేసింది రాష్ట్ర ప్రభుత్వం. బద్రీనాథ్, కేదర్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాల్లోని గర్భగుడిలో జరిపే పూజలను ప్రత్యక్ష ప్రసారం చేయడం కుదరదని ఉత్తరాఖాండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అన్నారు.

Chardham Yatra: ఛార్‌ధామ్ యాత్ర లైవ్ టెలికాస్ట్ చేయడం కుదరదని తేల్చి చెప్పేసింది రాష్ట్ర ప్రభుత్వం. బద్రీనాథ్, కేదర్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాల్లోని గర్భగుడిలో జరిపే పూజలను ప్రత్యక్ష ప్రసారం చేయడం కుదరదని ఉత్తరాఖాండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అన్నారు. అలా చేయాలని వేదాలలో కూడా ఎక్కడా ప్రస్తావించలేదని తెలిపారు.

ఛార్‌ధామ్ యాత్రను పరిమితమైన యాత్రికుల సమక్షంలోనే జరపాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. దీనిపై ఉత్తరాఖాండ్ హైకోర్టు స్టే విధించింది. అంతేకాకుండా ప్రార్థనలు, పూజా కార్యక్రమాలు లైవ్ లో ప్రసారం చేయాలంటూ కోరుతున్న ప్రజాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

సలహాలు, సూచనలన్నీ తీసుకున్న తర్వాత ఛార్‌ధామ్ యాత్రను లైవ్ ప్రసారం చేయదలచుకోలేదు. అలా చేయాలని వేదాల్లో కూడా రాసి లేదు. దీనిపై హైకోర్టులో అఫిడవిట్ సమర్పించాలని అనుకుంటున్నాం. అని సీఎం అన్నారు.

జులై 8న అడ్వకేట్ జనరల్ ఎస్ఎన్ బబూల్కర్ ‘శాస్త్రాల్లో లైవ్ స్ట్రీమింగ్ కు అనుమతివ్వాలని ఎక్కడ లేదంటూ’ కోర్టుకు విన్నవించారు. ఆ స్టేట్మెంట్ పై కౌంటర్ రెస్పాన్స్ వచ్చింది. ‘ఇండియా ప్రజాస్వామ్య దేశం. చట్టం సమక్షంలో నడుస్తుంది కానీ శాస్త్రాలను బట్టి కాదని బదులు వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు