వారసుడొచ్చాడు : మగపిల్లాడి కోసం 12 కాన్పులు

  • Publish Date - November 25, 2019 / 06:57 AM IST

మగపిల్లాడు పుట్టాలని ఒకటీ రెండూ కాదు ఏకంగా 12 సార్లు గర్భం దాల్చింది రాజస్థాన్ కు చెందిన మహిళ. ఇప్పటికే 11 మంది ఆడపిల్లలకు జన్మనిచ్చింది. 12 ప్రసవంలో మగపిల్లాడు పుట్టాడు. దీంతో చూశారా నాకు మగపిల్లాడు పుట్టాడు..అంటూ మగపిల్లాడ్ని కనలేదనిదావంటూ తనను వేధించినవారికి సమాధానం చెప్పింది ఆ సంతానలక్ష్మి. 

ఆమె పేరు గుడ్డి. వయస్సు 42 ఏళ్లు. రాజస్థాన్ చురు జిల్లాలో భర్తతో కలిసి ఉంటోంది. ఇప్పటికే ఆమెకు 11 మంది ఆడపిల్లలు పుట్టారు. మగపిల్లాడు పుట్టేదాకా ఎంతమందినైనా కంటానంటూ పట్టుపట్టుకుని కూర్చుని తన పంతాన్ని నెగ్గించుకుంది. ఎట్టకేలకూ నవంబర్ 20న మగ బిడ్డను ప్రసవించింది. దీంతో గుడ్డి ఆనందానికి అవథుల్లేకుండా పోయింది. ఈ సందర్భంగా గుడ్డిని.. ఇంతమందిని కన్నావు..ఆడపిల్లలంటే నీకు అంత చిన్నా చూపా అని అడిగితే ఆమె చెప్పిన సమాధానం వింటే ఆశ్చర్యపోవాల్సిందే. 

గుడ్డికి మగ బిడ్డ పుట్టట్లేదనీ..ఆమెలో ఏదో లోపం ఉందనీ..బంధువుల..స్థానికులు సూటిపోటి మాటలు మాట్లాడేవారు. అబ్బాయి పుట్టకపోతే అరిష్టమంటూ వేధించారు. ఆ మాటల్ని గుడ్డి..ఆమె భర్త కృష్ణ కుమార్ భరించలేకపోయేవారు. ఎలాగైనా సరే మగపిల్లాడ్ని కని తీరాలని ఈ క్రమంలో ఎంతమంది ఆడపిల్లలు పుట్టినా ఫరవాలేదనుకున్నారు. ఎలాగైతేనే మగపిల్లాడ్ని కన్నారు. ఇన్నేళ్లైనా అవమానాలు..మగపిల్లాడి పుట్టుకతో సరి..అంటూ తల ఎగరేస్తున్నారు గుడ్డీ దంపతులు.
ఊళ్లో వాళ్ల మాటలు పడలేక ఏకంగా 11 మంది పిల్లల్ని కని…12వ కాన్పులో మగబిడ్డ పుట్టడంతో తెగ ఆనందపడిపోతోంది. మా మొర దేవుడు ఆలకించాడు అంటోంది. గుడ్డీకి పుట్టిన 11 మంది ఆడపిల్లల్లో ముగ్గురికి పెళ్లిళ్లు కూడా అయిపోయాయి. 

ట్రెండింగ్ వార్తలు