Lord Krishna..Lessons on jihad To Arjuna : ’జిహాద్’ఖురాన్‌లోనే కాదు భగవద్గీతలోనూ ఉంది .. శ్రీకృష్ణుడు అర్జునుడికి జిహాద్‌ గురించి బోధించాడు’ : కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు

’జిహాద్’ఖురాన్‌లోనే కాదు భగవద్గీతలోనూ ఉంది .. శ్రీకృష్ణుడు అర్జునుడికి జిహాద్‌ గురించి బోధించాడు’ అంటూ కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

Lord Krishna gave lessons on jihad to Arjuna : ‘జీహాద్’..పేరుతో ఉగ్రవాదులు మారణహోమం సృష్టిస్తుంటారు. జీహాద్ అంటే పవిత్ర యుద్ధం అని అర్థం. కానీ జీహాద్ పేరుతో మారణహోమం చేసే ఉగ్రవాదులు ఉన్మాదం చర్యలు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే ‘జీహాద్’అనేది ఇస్లాముల పవిత్ర గ్రంథం ఖురాన్ లోనే కాదు భగవద్గీతలో కూడా ఉంది అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోం మంత్రి శివరాజ్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. జిహాద్ భావన గీతలో ప్రస్తావించబడిందని..మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి జిహాద్‌పై పాఠాలు చెప్పాడని వ్యాఖ్యానించారు శివరాజ్ పాటిల్.

కాంగ్రెస్ సీనియర్ నేత..కేంద్ర మాజీ మంత్రి మొహసినా కిద్వాయ్ జీవిత చరిత్ర ఆవిష్కరణ సందర్భంగా శివరాజ్ పాటిల్ మాట్లాడుతూ.. ‘ఇస్లాం మతంలో జిహాద్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. కానీ..ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎవరైనా స్వచ్ఛమైన ఆలోచనను అర్థం చేసుకోకపోతేనే బలాన్ని ఉపయోగించాల్సిందేనన్నారు. ఇది ఖురాన్ లోనే కాదు భగవద్గీతలో కూడా ప్రస్తావించబడింది’ అని అన్నారు.

శివరాజ్ జిహాద్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్‌ను హిందూ ద్వేషి అని ఆరోపించింది. కాంగ్రెస్ రాముడి ఉనికిని వ్యతిరేకిస్తూ రామ మందిరాన్ని కూడి వ్యతిరేకిస్తోందంటూ మండిపడ్డారు బీజేపీ నేతలు. ‘ఆప్‌కి చెందిన గోపాల్ ఇటాలియా, రాజేంద్ర పాల్ తర్వాత శ్రీ కృష్ణుడు అర్జునుడికి జిహాద్ నేర్పించాడని కాంగ్రెస్ శివరాజ్ పాటిల్ చెబుతున్నారు. గతంలో రాహుల్ గాంధీ కూడా హిందుత్వం గురించి మాట్లాడుతూ హిందూ సమూహాల కంటే ఎల్ఈటీ తక్కువ ప్రమాదకరమైనదన్నారు. ఇకపోతే కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ 26/11 ఉగ్రదాడుల విషయంలో హిందువులను నిందించారు..అంటూ కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

శివరాజ్ పాటిల్ 2004 నుంచి 2008 వరకు కేంద్ర హోం మంత్రిగా, 1991 నుంచి 1996 వరకు లోక్‌సభ స్పీకర్‌గా పని చేశారు. మొహసినా కిద్వాయ్ జీవిత చరిత్ర ఆవిష్కరణ కార్యక్రమానికి ఫరూక్ అబ్దుల్లా, సుశీల్ కుమార్ షిండే,శశి థరూర్, దిగ్విజయ్ సింగ్ వంటి కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.

ట్రెండింగ్ వార్తలు