Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయ కానుకల చోరీ కేసు.. ఎస్బీఐతో పాటు పలు బ్యాంకులకు నోటీసులు
అయోధ్య శ్రీరామ మందిరం(Ayodhya Ram Mandir) విరాళాల చోరీ ఉదంతం బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేస్తోంది.
- V Santhosh Kumar
- Published on- June 29, 2026 / 09:33 PM IST
Notices issued to SBI in Ayodhya Ram Mandir donations theft case
- బ్యాంకులకు నోటీసుల జారీ
- సిబ్బంది అరెస్ట్, విచారణ
- పెద్దల గుట్టు వీడే అవకాశం
Ayodhya Ram Mandir: అయోధ్య శ్రీరామ మందిరం విరాళాల చోరీ ఉదంతం బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేస్తోంది. ఈ భారీ అక్రమాలపై దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాతో సహా దాదాపు 7 ప్రముఖ బ్యాంకులకు నోటీసులు జారీ చేశారు. ట్రస్ట్‌కు సంబంధించిన ప్రధాన ఖాతాలు, లాకర్ల వివరాలతో పాటు ఇటీవల జరిగిన అనుమానాస్పద లావాదేవీల రికార్డులను తక్షణమే సమర్పించాలని ఆదేశించారు. భక్తులు సమర్పించిన సొమ్ము ఏ ఏ అకౌంట్లలోకి బదిలీ అయిందో తెలుసుకునేందుకు ‘ట్రాన్సాక్షన్ ట్రైల్’ ద్వారా నిధుల కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నారు.
Ap Government: ఏపీ ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్.. ఇకనుంచి వాట్సప్‌లోనే ఫిర్యాదులు
ఇందులో భాగంగానే అయోధ్య(Ayodhya Ram Mandir)లోని ఎస్బీఐ ‘నయా ఘాట్’ బ్రాంచ్‌కు వెళ్లిన ప్రత్యేక పోలీస్ బృందం.. క్యాష్ కౌంటింగ్, నిధుల బదిలీ ప్రక్రియపై బ్యాంక్ సిబ్బందిని ప్రశ్నించింది. త్వరలోనే బ్యాంక్ మేనేజర్‌ను కూడా విచారించి స్టేట్‌మెంట్ రికార్డ్ చేయనున్నారు. దర్యాప్తులో భాగంగా బ్యాంక్ లావాదేవీల రికార్డులు, సీసీటీవీ ఫుటేజీలు, క్యాష్ మూవ్‌మెంట్ డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విరాళాల లెక్కింపు, భద్రత, బ్యాంక్‌కు తరలింపు ప్రక్రియలో కొందరు బ్యాంక్ సిబ్బంది కుమ్మక్కైనట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఈ స్కామ్‌కు సంబంధించి ఎస్బీఐ పేరోల్‌పై పనిచేస్తున్న రత్నేష్, గగన్‌దీప్ అనే ఇద్దరు ఉద్యోగులతో పాటు ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న మరో ఆరుగురు సిబ్బందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. నిందితుల్లో సుభాష్, టీన్నూ మినహా మిగిలిన వారంతా ఔట్‌సోర్సింగ్ స్టాఫ్‌గా గుర్తించారు. ప్రస్తుతం నిందితుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలను, చాట్ హిస్టరీని పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. బ్యాంక్ రికార్డులు పూర్తిగా బయటపడితే, ఈ చోరీ వెనుక ఉన్న మరికొంతమంది పెద్ద తలకాయల గుట్టు వీడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
