Ajay Misra : కేంద్రమంత్రి మిశ్రా కాన్వాయ్ పై కోడిగుడ్ల దాడి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌మిశ్రాకు ఆదివారం భువనేశ్వర్‌లో చేదు అనుభవం ఎదురైంది. భువనేశ్వర్ విమానాశ్రయం నుంచి కటక్‌లోని సీఐఎస్ఎఫ్ క్యాంపస్‌కు వెళ్తున్న మంత్రి కాన్వాయ్‌పై
- venkaiahnaidu
- Updated on- October 31, 2021 / 07:17 PM IST
Misra
Ajay Misra కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌మిశ్రాకు ఆదివారం భువనేశ్వర్‌లో చేదు అనుభవం ఎదురైంది. భువనేశ్వర్ లోని బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కటక్‌లోని సీఐఎస్ఎఫ్ క్యాంపస్‌కు వెళ్తున్న మంత్రి కాన్వాయ్‌పై కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం(NSUI)కార్యకర్తలు కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు.
మంత్రి కాన్వాయ్‌ను ముందుకు పోనివ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. నల్ల బ్యాడ్జ్‌లను ప్రదర్శిస్తూ.. మినిస్టర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మంత్రిపై కోడిగుడ్ల దాడిని ఖండిస్తూ బీజేపీ కార్యకర్తలు ఎయిర్‌పోర్ట్ ముందు నిరసనకు దిగారు.
కాగా, ఈ నెల ప్రారంభంలో ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలో అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది చనిపోయారు.
దీనిపై కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నాయి. కేంద్ర మంత్రి పదవి నుంచి అజయ్ మిశ్రాను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాల మధ్య ఒడిశాకు చేరుకున్న కేంద్రమంత్రికి కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నుంచి నిరసన సెగ తగిలింది.
ALSO READ Taliban Supreme : అజ్ణాతం వీడిన అఖుండ్‌జాదా..తొలిసారి పబ్లిక్ ముందుకు తాలిబన్ సుప్రీం లీడర్
