Taliban Supreme : అజ్ణాతం వీడిన అఖుండ్‌జాదా..తొలిసారి పబ్లిక్ ముందుకు తాలిబన్ సుప్రీం లీడర్

తాలిబన్ సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుండ్‌జాదా మొదటిసారిగా పబ్లిక్ ముందుకు హైబతుల్లా వచ్చారంటూ తాలిబన్ అధికారికంగా ప్రకటించింది. అప్ఘానిస్తాన్ లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటై

Taliban Supreme : అజ్ణాతం వీడిన అఖుండ్‌జాదా..తొలిసారి పబ్లిక్ ముందుకు తాలిబన్ సుప్రీం లీడర్

Afghan

తాలిబన్ సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుండ్‌జాదా మొదటిసారిగా పబ్లిక్ ముందుకు హైబతుల్లా వచ్చారంటూ తాలిబన్ అధికారికంగా ప్రకటించింది. అప్ఘానిస్తాన్ లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటై రెండు నెలలవుతున్నా ప్రభుత్వాధినేతగా ఉన్న అఖుండ్‌జాదా ఇప్పటి వరకు బయట ప్రపంచానికి కనిపించకపోవడంతో అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. అఖుండ్‌జాదా చనిపోయాడంటూ కొంత కాలంగా పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అఖుండ్ జాదా గురించి ఆదివారం కీలక ప్రకటన చేసిన తాలిబన్లు..తమ నేత ప్రజల మధ్యకు వచ్చారని వెల్లడించారు.

అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ..కాందహార్‌లోని జామియా దారుల్ అలూమ్ హకీమియా అనే ఇస్లామిస్ట్ పాఠశాలను హైబతుల్లా శనివారం సందర్శించారని, అక్కడ ప్రజలకు ఆయన కనిపించారని అధికారిక ప్రకటనలో తాలిబన్​ పేర్కొంది. తాలిబన్ల మద్దతుదారులను ఉద్దేశించి అఖుండ్‌ జాదా ప్రసంగించారని తాలిబన్‌ వర్గాలు ప్రకటించాయి. అయితే, దీనికి సంబంధించిన ఫోటోలుగానీ, వీడియోలుగానీ తాలిబన్లు విడుదల చేయలేదు. కానీ, ఆయన ప్రసంగంలోని 10 నిమిషాల నిడివి గల కొంత భాగాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

హైబతుల్లా అఖుంద్​జాదా తన ప్రసంగలో తాలిబన్ నాయకత్వం గురించి తప్పా.. రాజకీయాలు, ప్రభుత్వానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించలేదని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. కేవలం తాలిబన్ల నాయకత్వానికి దేవుడి ఆశీస్సులు ఉంటాయని మాత్రమే అన్నట్లు తెలుస్తోంది. సవాళ్లు ఎదుర్కొంటున్న అఫ్గన్‌కు విజయం వరించాలని ప్రార్థించినట్లు సమాచారం.

కాగా,తొలి నుంచి హైబతుల్లా అఖుండ్‌జాదా మతపరమైన కార్యకలాపాల్లో నిమగ్నమై అజ్ఞాతంలోనే ఉంటున్నారు. 2016లో అప్పటి తాలిబన్​ సుప్రీం లీటర్​ ముల్లా అక్తర్ మన్సూర్​ను అమెరికా డ్రోన్​ దాడిలో మట్టుబెట్టిన తర్వాత.. హైబతుల్లా అఖుండ్‌జాదా ఆ పదవిలోకి వచ్చారు. 2016 నుంచి తాలిబన్‌ సంస్థకు సైనికంగా, రాజకీయంగా, మతపరంగా అధినేతగా ఉంటూ వస్తున్న హైబతుల్లా గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. ఇంకా చెప్పాలంటే అతడు ఎలా ఉంటాడనేది ఎవరికి తెలిసేది కాదు. తాలిబన్లే స్వయంగా అతడి ఫొటో విడుదల చేశారు. అప్పటి వరకు చాలా మందికి అతడి గురించి తెలియదు.

హైబతుల్లాకి పబ్లిక్‌లో కనిపించాలని ఉండదని, అందుకే ఆయన బయటికి పెద్దగా రారని గతంలో అనేకసార్లు తాలిబన్ సంస్థ చెప్పుకొచ్చింది. అయితే రహస్య జీవితం గడుపుతున్న అకుంద్​జాదాపై అప్పట్లో పలు వదంతులు వచ్చాయి. అతడు కరోనాతో చనిపోయాడని కూడా ప్రచారం సాగింది. అయితే తాలిబన్లు చేసిన తాజా ప్రకటనతో ఆ అనుమానాలకు తెరపడింది.

ALSO READ Kameng River : నల్లగా మారిన అరుణాచల్ నది..చైనానే కారణం!