Kameng River : నల్లగా మారిన అరుణాచల్ నది..చైనానే కారణం!

 అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రం తూర్పు కమెంగ్ జిల్లాలోని కమెంగ్ నదిలోని నీరంతా శుక్రవారం ఒక్కసారిగా న‌లుపు రంగులోకి మారిపోయింది. చూస్తుండగానే వేలాది చేపలు చనిపోయాయి.

Kameng River : నల్లగా మారిన అరుణాచల్ నది..చైనానే కారణం!

River2

Kameng River అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రం తూర్పు కమెంగ్ జిల్లాలోని కమెంగ్ నదిలోని నీరంతా శుక్రవారం ఒక్కసారిగా న‌లుపు రంగులోకి మారిపోయింది. చూస్తుండగానే వేలాది చేపలు చనిపోయాయి. ఈ ఆకస్మిక పరిణామంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే,న‌దిలో క‌రిగే వ్య‌ర్థాల (TDS) ప‌రిమాణం భారీ స్థాయికి చేరడంతోనే నీరు నలుపు రంగులోకి మారినట్లు ప్రాథమికంగా గుర్తించామని జిల్లా మత్స్య అభివృద్ధి విభాగం అధికారి హలీ తాజో తెలిపారు.

సాధార‌ణంగా లీట‌ర్ నీటిలో 300 నుంచి 1200 మిల్లీ గ్రాముల వ‌ర‌కు ఉండాలి… కానీ కామెంగ్ న‌దిలో 6800 మిల్లీ గ్రాముల టీడీఎస్ ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు. దీని వ‌ల్లే కామెంగ్ న‌దిలోని నీరు అక‌స్మాత్తుగా న‌ల్ల‌గా మారింద‌ని..ఈ రకమైన నీళ్లలో జలచరాలకు ఏమీ కనిపించదని, పైగా ఆక్సిజన్‌ పీల్చుకోడానికి ఇబ్బంది పడతాయని వివరించారు. చేపల మృతికి ఇదే కారణమై ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. మృత్యువాతపడిన చేపలను తింటే తీవ్ర అనారోగ్య సమస్యలకు అవకాశం ఉన్నందున వాటిని తినొద్దని స్థానికులకు విజ్ఞప్తి చేశారు. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు నదిలో చేపలు పట్టొద్దని, చనిపోయిన వాటిని విక్రయించడం, తినడం చేయవద్దని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది.

అయితే నదిలో టీడీఎస్‌ స్థాయిలు పెరగడానికి చైనాయే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. చైనాలో య‌థేచ్ఛ‌గా భారీ నిర్మాణాలు చేప‌ట్ట‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని అక్క‌డి ప్ర‌జ‌లు ఆరోపిస్తున్నారు. ఈ అంశంలో వాస్తవాలను వెలికితీయడానికి వెంటనే నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని తూర్పు సెప్పా ఎమ్మెల్యే తపుక్ టాకు ప్రభుత్వానికి విజ్ణప్తి చేశారు.

మరోవైపు,2017 నవంబర్ లో కూడా తూర్పు సియాంగ్ జిల్లాలోని పాసిఘాట్ దగ్గరనున్న సియాంగ్ నదిలో నీరు ఇలాగే నల్లగా మారింది. చైనా సొరంగం నిర్మాణం కారణంగానే ఈ దుస్థితి ఏర్పడింది. అయితే చైనా మాత్రం తమకేమీ సంబంధం లేదని ఈ వాదనలను ఖండించింది.

ALSO READ MRP On Alcohol: మందుబాటిల్స్ ఎమ్మార్పీ ధరలపై 10శాతం ఎక్స్‌ట్రా చెల్లించాల్సిందే..