MRP On Alcohol: మందుబాటిల్స్ ఎమ్మార్పీ ధరలపై 10శాతం ఎక్స్‌ట్రా చెల్లించాల్సిందే..

ఎక్సైజ్ విధానంలో వచ్చిన మార్పులను బట్టి ఆల్కహాల్ పై గతంలో ఉన్న ఎమ్మార్పీ కంటే 10శాతం ఎక్కువ చెల్లించాలి. ఈ ధరల మార్పులు హోల్ సేల్ ధరలపై కూడా వర్తిస్తుంది.

MRP On Alcohol: మందుబాటిల్స్ ఎమ్మార్పీ ధరలపై 10శాతం ఎక్స్‌ట్రా చెల్లించాల్సిందే..

Mrp Alcohol

MRP On Alcohol: కొవిడ్ ఫస్ట్ వేవ్ తర్వాత కొద్ది రోజులకే తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. బీర్ బాటిల్స్ మీద రూ.10 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇది అమలవుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా బీర్ వినియోగంలో కాస్త మార్పులు కనిపించాయి. ఇదిలా ఉంటే ఢిల్లీ ప్రభుత్వం మాత్రం నవంబర్ 17 నుంచి కొత్త రూల్ తీసుకొస్తుంది.

ఎక్సైజ్ విధానంలో వచ్చిన మార్పులను బట్టి ఆల్కహాల్ పై గతంలో ఉన్న ఎమ్మార్పీ కంటే 10శాతం ఎక్కువ చెల్లించాలి. ఈ ధరల మార్పులు హోల్ సేల్ ధరలపై కూడా వర్తిస్తుంది. ఎమ్మార్పీ ధరలను కూడా 8 నుంచి 9శాతం పెంచే అవకాశం ఉందని చెప్తున్నారు.

హోల్ సేల్ ధరలు 5నుంచి 10శాతం పెంచడం ఫలితంగా లిక్కర్ ఎమ్మార్పీ ఇంకాస్త పెరిగేలా ఉందని లిక్కర్ వ్యాపారి చెప్తున్నారు. కొత్తగా అమలవుతోన్న ఎక్సైజ్ పాలసీ ప్రకారం.. రిటైల్ వ్యాపారంపై ఇది ఎక్కువ ప్రభావం కనిపిస్తుందని అంటున్నారు.

…………………………………. : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రియాంక ఫైర్

కొత్త ఎక్సైజ్ పాలసీని బట్టి 2021-22 ప్రకారం.. ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ లను లైసెన్స్ ఫీజులో అదనంగా విధిస్తున్నారు. రివైజ్‌డ్ పారామీటర్స్ ను బట్టి.. ఇండియన్, విదేశ లిక్కర్ పై హోల్ సేల్ ధరపై 8నుంచి 9శాతం పెంచుతున్నట్లు ఆదేశాలు అందాయి. నవంబర్ 17 నుంచి ఇది అమల్లోకి రానుంది.