Gorakhpur : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రియాంక ఫైర్

ఆదివారం గోరఖ్ ఫూర్ లో ప్రియాంక గాంధీ బహిరంగసభ నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

Gorakhpur : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రియాంక ఫైర్

Up Priyanka

Priyanka Gandhi Gorakhpur : ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఏడాది ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలిచి పార్టీకి పూర్వ వైభవం తీసుకరావాలని చూస్తోంది కాంగ్రెస్ పార్టీ. పార్టీ గెలుపు కోసం ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ ప్రియాంక గాంధీ వాద్రా శతవిధాల ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. హామీల వర్షం కురిపిస్తున్నారు. హమ్ వచన్ నిభాయేంగే అనే నూతన నినాదంతో ప్రజల్లోకి వెళుతున్నారు.

Read More : Akhanda: బాలయ్య ఫ్యాన్స్ కు ఊరట.. అదిరే ట్రీట్ వచ్చేస్తుంది

ఈ క్రమంలో…2021, అక్టోబర్ 31వ తేదీ ఆదివారం గోరఖ్ ఫూర్ లో ప్రియాంక గాంధీ బహిరంగసభ నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ 70 ఏళ్లలో రైల్వేలు, విమానాశ్రయాలు నిర్మిస్తే..మోదీ సర్కార్ ఏడేళ్లలోనే అన్నీ అమ్మేస్తోందని విమర్శించారు. యూపీలో 5 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారని, నిరుద్యోగంతో ప్రతి రోజుకు ముగ్గురు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సభలో ప్రియాంక వివరించారు.

Read More : Afghan : మా పాలన గుర్తించండి…తాలిబన్ల విజ్ఞప్తి

ఎప్పుడో ఒకప్పుడు తనను చంపుతారని ఇందిరాగాంధీకి ఎప్పుడో తెలుసని, ఇందిరాగాంధీ స్పూర్తితో మీ ముందుకొచ్చానన్నారు. అధిక ధరలతో ప్రజలు అల్లాడిపోతున్నారని..అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రజల కష్టాలను సీఎం యోగి పట్టించుకోవడం లేదని, రాష్ట్రంలో శాంతిభధ్రతలు అద్భుతంగా ఉన్నాయంటూ కేంద్ర హోం శాఖ మంత్రి షా ప్రశంసిస్తున్నారని..అయితే…మంత్రి అజయ్ మిశ్రా ఉన్న విషయాన్ని మరిచిపోతున్నారని ఎద్దేవా చేశారు. రైతులను తన కాన్వాయ్ తో తొక్కించి…మంత్రి స్వేచ్చగా తిరుగుతున్నారని ప్రియాంక విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న విపక్ష పార్టీలు ప్రజా సమస్యలపై పోరాడడంలో విఫలమయ్యాయని, ప్రతి అంశంపై కాంగ్రెస్ పోరాడుతోందని ప్రియాంక వెల్లడించారు.