NEET-UG: లీకుల ఎఫెక్ట్.. NEET-UGలో భారీ మార్పులు.. వచ్చే ఏడాది నుంచి..

దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్-యూజీ (NEET-UG) ప్రవేశ పరీక్షలో కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది.

NTA to conduct computerised exam for NEET-UG from next year

  • ఆన్‌లైన్‌లోనే నీట్ పరీక్ష నిర్వహణ
  • పేపర్ లీకులకు శాశ్వతంగా చెక్
  • పరీక్షా కేంద్రాలలో పటిష్ట భద్రత

NEET-UG: దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్-యూజీ (NEET-UG) ప్రవేశ పరీక్షలో కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. గతంలో జరిగిన ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతాలు, అక్రమాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేలా పరీక్షా విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తోంది. ఈ క్రమంలోనే పారదర్శకతను పెంచేందుకు సరికొత్త సాంకేతిక విధానాలను అమలు చేయబోతున్నారు.

Rushikonda Buildings: రుషికొండ భవనాలపై మళ్లీ ఉత్కంఠ.. హై కోర్ట్ కీలక ఆదేశాలు.. మళ్ళీ మొదటికే వచ్చిందిగా!

ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సుల మేరకు వచ్చే విద్యా సంవత్సరం నుండి నీట్-యూజీ పరీక్షను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత (CBT) విధానంలో నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 500 నగరాల్లోని 1,000 కేంద్రాల్లో ఐదు నుంచి ఆరు రోజుల పాటు విడతల వారీగా ఈ పరీక్షలు జరుగుతాయి. ప్రతిరోజూ దాదాపు 5 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. కేంద్రీయ, నవోదయ విద్యాలయాల వంటి ప్రభుత్వ సంస్థలకే పరీక్షా కేంద్రాలుగా ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

పరీక్షలను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సంస్థాగత భద్రత, పరిపాలన ప్రమాణాలను అక్టోబర్ నాటికి పూర్తిగా పునర్వ్యవస్థీకరించనున్నారు. గత రెండు దశాబ్దాల్లో దేశంలో జరిగిన వివిధ ప్రవేశ పరీక్షల లీకేజీలపై దర్యాప్తు కొనసాగుతోందని, దోషులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేశారు. పేపర్ లీకులకు తావులేకుండా అత్యంత పటిష్టమైన భద్రతతో త్వరలోనే పూర్తి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు విద్యాశాఖ చర్యలు వేగవంతం చేసింది.