Petrol Diesel Price Hike : రూ.3, 4తో లాభం లేదు.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచాలని ప్రతిపాదన.. ఏకంగా..

Petrol Diesel Price Hike : పశ్చిమాసియా సంక్షోభం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు సరఫరాపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. దీంతో భారతదేశంలో ప్రభుత్వ చమురు సంస్థలపై ఆర్థిక ఒత్తిళ్లు పెరిగాయి. ఈ క్రమంలో వారం రోజుల్లో రెండుసార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అయితే, ప్రస్తుతం ధరలు స్వల్పంగా పెరిగినా.. ఈనెలాఖరులోగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి భారీగా పెంచేందుకు ఆయిల్ కంపెనీలు సిద్ధమవుతున్నాయని బ్రోకరేజ్ సంస్థ కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ అంచనా వేసింది.

Petrol Diesel Price Hike

  • వాహనదారులకు మరో బిగ్ షాక్
  • వారంలో రెండుసార్లు పెరిగిన ఇంధన ధరలు
  • వచ్చే వారంరోజుల్లో మరోసారి భారీగా పెరిగే ఛాన్స్
  • ఈసారి లీటర్‌పై రూ.13 నుంచి రూ.17వరకు పెరిగే అవకాశం

Petrol Diesel Price Hike : పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరగబోతున్నాయా..? ఈసారి లీటర్ పై రూ.10 నుంచి రూ.15వరకు పెంచేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సిద్ధమవుతున్నాయా..? వాహనదారులకు బిగ్ షాకిచ్చేందుకు కేంద్రం రెడీ అయిందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలపై వారంలో రెండు సార్లు పెరిగాయి. గత నాలుగు రోజుల క్రితం లీటర్ పెట్రోల్, డీజిల్ పై రూ.3చొప్పున పెరగ్గా.. తాజాగా (మంగళవారం) లీటర్ పెట్రోల్, డీజిల్ పై 90 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే, మరో వారం రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగబోతున్నాయని తెలుస్తోంది.

Also Read : Four Day Work Week : ఇకనుంచి వారంలో నాలుగు రోజులే పనిదినాలు.. ఈ రంగాల్లో అమలుకు కేంద్రం నిర్ణయం?

బ్రోకరేజ్ సంస్థ కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ ప్రకారం.. పశ్చిమ ఆసియా యుద్ధం కారణంగా కలిగే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఇటీవల తీసుకున్న చర్యలు, భారతదేశం ఎదుర్కొంటున్న, పెరుగుతున్న స్థూల ఆర్థిక సవాళ్లను పరిష్కరించడానికి ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ పై పెంచిన ధరలు సరిపోకపోవచ్చునని, వచ్చే వారంరోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. డీజిల్ పై లీటకు రూ.11.40, పెట్రోల్ పై లీటరుకు రూ.14.30 మేర పెరిగే అవకాశం ఉందని, అయితే, ప్రస్తుతం నష్టాలను పూర్తిగా పూడ్చడానికి పెట్రోల్, డీజిల్ పై లీటరకు రూ.13 నుంచి రూ.17 వరకు అవసరం కావచ్చునని కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ అంచనా వేసింది.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్ పరిణామాల కారణంగా గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో భారత ప్రభుత్వ రంగ చమురు సంస్థలపై ఆర్థిక భారం పెరిగిందని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు ప్రతి నెలా సుమారు రూ.25,000 కోట్ల నష్టాలను చవిచూస్తున్నాయని అంచనా. అయితే, రాబోయే రోజుల్లో ఇంధన ధరల పెంపును కొట్టిపారేయలేమని నివేదికలు సూచిస్తున్నాయి. గత 75 రోజులుగా పేరుకుపోయిన నష్టాలను పూడ్చుకోవడానికి చమురు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయని, అయితే భవిష్యత్తులో ధరల పెంపు క్రమంగా కొనసాగవచ్చని బిజినెస్ టుడే టీవీ తన నివేదికలో పేర్కొంది.

అయితే, పెట్రోల్, డీజిల్ ధరలను ఒకేసారి భారీగా పెంచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎందుకంటే.. ఇంధన ధరలను ఒకేసారి పెంపు చేయడం వల్ల రవాణా ఖర్చులు, నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇలానే కొనసాగితే.. వచ్చే నెల రోజుల్లో పలు దఫాలుగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే అవకాశం ఉందని, తద్వారా ఈ నెలాఖరు వరకు లీటర్ పై రూ.13 నుంచి రూ.17వరకు పెరిగే చాన్స్ ఉందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.