Old Woman Fighting : బజారులో బరిగీసి కొట్టుకున్న బామ్మలు, ఈ వారం మోస్ట్ ఫన్నీ వీడియో!
సోషల్ మీడియాలో నిత్యం కొన్ని ఫన్నీ వీడియోలు కనిపిస్తాయి. అవి చూడగానే తెగ నవ్వేస్తుంటారు నెటిజన్లు.
- kunduru Vinod
- Published On : October 22, 2021 / 08:00 PM IST
Old Woman Fighting
Old Woman Fighting : సోషల్ మీడియాలో నిత్యం కొన్ని ఫన్నీ వీడియోలు కనిపిస్తాయి. అవి చూడగానే తెగ నవ్వేస్తుంటారు నెటిజన్లు. తాజాగా వైరల్ అయిన వీడియో ఒకటి నెటిజన్లను పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఇద్దరు వృద్ధమహిళల మధ్య గొడవ జరగడంతో వారు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. జుట్లు పట్టుకొని కిందపడి మరి కొట్టుకున్నారు. అయితే వారి మధ్య జరిగిన ఫన్నీ ఫైట్ ని మనం ఈ వీడియోలో చూడవచ్చు.
చదవండి : Anti-Taliban Fighters: వారి ముఖాలను నేలకు రుద్ది అఫ్ఘానిస్తాన్‌ను కాపాడుకుంటాం
మొదట ఇద్దరు వృద్ధ మహిళలు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత మాట మాట పెరగడంతో పోట్లాడుకున్నారు. ఇక నువ్వా నేనా అంటూ తలపడుతున్న సమయంలోనే ఇద్దరు కిందపడ్డారు. ఆ తర్వాత కొన్ని క్షణాలకే వీడియో ఎండ్ అయింది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. WWEని తలపిస్తున్న వీరి ఫైట్ ఇప్పుడు సోషల్ మీడియాను ఓ ఊపు ఊపుతుంది.
చదవండి : Devaragattu Bunny Fight: బన్నీ ఉత్సవం.. చితక్కొట్టుకున్నారు!
