Building Collapse : ముంబైలో కూలిన నాలుగు అంతస్తుల భవనం..ఒకరు మృతి
అటు ఘటనా స్థలాన్ని పరీశిలించిన మంత్రి ఆదిత్య ఠాక్రే.. ఈ ఘటన దురదృష్టకరమన్నారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేస్తే వెంటనే భవనాలు ఖాళీ చేయాలని, లేదంటే ఇలాంటి ఘటనలే జరుగుతాయని చెప్పారు.
- bheemraj
- Published On : June 28, 2022 / 11:00 AM IST
Mumbai
building collapse : ముంబై నాయక్‌నగర్‌లో భవనం కూలిన ఘటనలో ఒకరు చనిపోయారు. నాయక్‌నగర్‌లో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిపోవడంతో సమాచారం అందుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడారు. భవనం శిథిలాల కింద చిక్కుకుపోయిన ఎనిమిది మందిని రక్షించారు.
ఆ తర్వాత వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతున్నారు. అయితే మరో 20 నుంచి 25 మంది భవన శిథిలాల్లో చిక్కుకుపోయారని అధికారులు అనుమానిస్తున్నారు. వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
Building Collapse : పూణేలో నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఐదుగురు మృతి
అటు ఘటనా స్థలాన్ని పరీశిలించిన మంత్రి ఆదిత్య ఠాక్రే.. ఈ ఘటన దురదృష్టకరమన్నారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేస్తే వెంటనే భవనాలు ఖాళీ చేయాలని, లేదంటే ఇలాంటి ఘటనలే జరుగుతాయని చెప్పారు. అయితే, శిథిలాల్లో చిక్కుకుపోయిన వారందరినీ రక్షించడమే తమ ప్రాధాన్యం అన్నారు.
