Mamata Banerjee: మోడీ గడ్డం మాత్రమే పెరుగుతోంది.. స్క్రూ లూజ్ అయిందేమో
వెస్ట్ బెంగాల్ శాసన సభ ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత దూషణలు పెరుగుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
- Subhan Ali Shaik
- Updated on- March 27, 2021 / 10:19 AM IST
Mamata Modi
Mamata Banerjee: ప్రధాని నరేంద్రమోడీపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి మరోసారి నిప్పులు చెరిగారు. మోడీ హయాంలో దేశంలో పారిశ్రామిక ప్రగతి పూర్తిగా నిలిచిపోయిందని ఆరోపించారు.
వెస్ట్ బెంగాల్ శాసన సభ ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత దూషణలు పెరుగుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. టీఎంసీ గెలుపు కోసం ప్రచారం చేస్తున్న మమత ఓ బహిరంగ సభలో శుక్రవారం మాట్లాడారు.
ప్రధాని మోదీ గడ్డం మాత్రమే పెరుగుతోందని విమర్శించారు. ఆరోపించారు. ఒక్కోసారి ఆయన తనను తాను స్వామి వివేకానందగా చెప్పుకుంటారని, మరోసారి స్టేడియాలకు తన పేరు పెట్టుకుంటారని ఎద్దేవా చేశారు.
ఆయన పరిస్థితి చూస్తూ ఉంటే, బుర్రలో ఏదో తేడా ఉందని, స్క్రూ లూజ్ అయినట్లుందని వ్యాఖ్యానించారు.
ఇదిలావుండగా, బీజేపీ బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్ ఇటీవల మాట్లాడుతూ, ముఖ్యమంత్రి మమత బెనర్జీ బెంగాలీ సంస్కృతికి తగినట్లు వ్యవహరించడం లేదని ఆరోపించారు. ఆమె చీర ధరించి, కాళ్ళు కనిపించేలా చేస్తున్నారని, దీని పట్ల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఆమె తన కాళ్ళను చూపించాలనుకుంటే బర్మూడా షార్ట్స్ ధరించాలన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మరోసారి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.
