MEA Shocking Report: విదేశాల్లో భారతీయ విద్యార్థుల ఒత్తిడి.. మూడేళ్లలో 100 మంది మృతి.. డాలర్ డ్రీమ్స్ కిల్ అవుతున్నాయా?
విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA Shocking Report) వివరాల ప్రకారం 2023-2025 మధ్య కాలంలో అమెరికా, కెనడాల్లో 100 మందికి పైగా భారతీయులు ఆత్మహత్య చేసుకున్నారు.
Mental health crisis indian students suicide us canada mea report
- విదేశాల్లో భారతీయ విద్యార్థుల ఒత్తిడి
- అప్పుల భారం ఉద్యోగాల అభద్రత
- ఇరాన్ నుండి భారతీయుల తరలింపు
MEA Shocking Report: ఉపాధి, ఉన్నత చదువుల కోసం విదేశాలకు, ముఖ్యంగా ఉత్తర అమెరికా (యుఎస్, కెనడా) కు వెళ్లే భారతీయుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కానీ, అక్కడికి వెళ్ళాక అంతా తలకిందులవుతోంది. ప్రొఫెషనల్ గా, పర్సనల్ గా అక్కడ వారు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA Shocking Report) రాజ్యసభలో సమర్పించిన వివరాల ప్రకారం, 2023-2025 మధ్య కాలంలో అమెరికా, కెనడాల్లో 100 మందికి పైగా భారతీయులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన భారతీయ పౌరుల ఆత్మహత్యల్లో ఇవి దాదాపు 5 శాతంగా ఉన్నాయి. ప్రధానంగా 21 నుంచి 30 ఏళ్ల వయస్సు గల యువత, విద్యార్థులు తీవ్రమైన నిరాశ, ఆందోళనతో బాధపడుతున్నట్లు అధ్యయనాలు తెలుపుతున్నాయి.
ఆర్థిక భారం, ఉద్యోగ అవకాశాల క్షీణత:
విదేశాలకు వెళ్లే విద్యార్థులు దాదాపు రూ.50 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకుంటున్నారు. అయితే ఇటీవల ఉద్యోగ మార్కెట్ మందగించడం, పార్ట్-టైమ్ పనులు లభించకపోవడం, పెరుగుతున్న జీవన వ్యయం వల్ల లోన్లు తీర్చలేక, కనీస అవసరాలు తీర్చుకోలేక తీవ్రమైన ఆర్థిక తీవ్రతను ఎదుర్కొంటున్నారు. దీనికితోడు ఒంటరితనం, భవిష్యత్తుపై అభద్రతా భావం వల్ల కొందరు మాదకద్రవ్యాల బారిన పడుతున్నారని, ఇది మానసిక ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తోందని నిపుణులు, మానసిక వైద్యులు పేర్కొంటున్నారు.
ఇరాన్ నుండి భారతీయుల సురక్షిత తరలింపు:
మరోవైపు, పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకుపోయిన దాదాపు 2,500 మంది భారతీయులను ప్రభుత్వం ఆర్మేనియా ద్వారా సురక్షితంగా స్వదేశానికి తరలించింది. విదేశాంగ శాఖ 24/7 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్లు, ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ, పౌరుల భద్రతకు అవసరమైన సలహాలు, మార్గదర్శకాలు అందించినట్లు కేంద్ర సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ తెలిపారు.
