Annamalai: అన్నామలై ‘వుయ్‌ ద లీడర్స్‌’ ఉద్యమం.. ఒక్కరోజులోనే 14 లక్షల మంది సపోర్ట్

అన్నామలై(Annamalai) 'వుయ్‌ ద లీడర్స్‌' ఉద్యమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

Over 1.4 million people joined annamalai We the Leaders movement in just 24 hours

  • అన్నామలై కొత్త రాజకీయ పార్టీ ప్రస్థానం.
  • 24 గంటల్లోనే భారీ ప్రజాస్పందన.
  • వంశపారంపర్య రాజకీయాలపై యువత పోరాటం

Annamalai: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ ఐపీఎస్‌ మాజీ అధికారి కె.అన్నామలై సరికొత్త అడుగులు వేస్తున్నారు. ఇటీవల ఆయన భాజపా పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నైతిక రాజకీయాల కోసం యువతను భాగస్వాములను చేసేందుకు ‘వుయ్‌ ద లీడర్స్‌’ పేరుతో సరికొత్త ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారానికి సంబంధించిన ఆన్‌లైన్ లింక్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా, కేవలం 24 గంటల వ్యవధిలోనే 14 లక్షలకు పైగా ప్రజలు ఇందులో చేరడం విశేషం.

Stree Ride: తెలంగాణలో ‘స్త్రీ రైడ్’ సేవలు.. మహిళల రక్షణే లక్ష్యం.. ప్రాజెక్టును ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్

వంశపారంపర్య, సాంప్రదాయ రాజకీయాలకు స్వస్తి పలికి, సామాన్యులను చట్టసభలకు పంపడమే లక్ష్యంగా ఆయన త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారు. రాజకీయాలను ప్రజల చెంతకే తీసుకువెళ్లడం తన ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే కోయంబత్తూరులో ఏపీజే అబ్దుల్ కలాం కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

గతంలో ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలి, మంచి ఆశయాలతోనే భాజపాలో చేరానని గుర్తుచేసిన అన్నామలై(Annamalai), ఇప్పుడు అదే ఆశయ సాధన కోసం కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. నూతన రాజకీయ వ్యవస్థ నిర్మాణంలో యువత పెద్ద సంఖ్యలో కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదంతా గమనిస్తుంటే రానున్న రోజుల్లో అన్నామలై కి సపోర్ట్ గా లక్షల మంది కలుకలిపే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు.