pharmacy employ typing talent
pharmacy employ typing talent : అందరూ చేతిరాతలు మర్చిపోతున్న కాలం ఇది. మొబైల్ ఫోన్స్, కంప్యూటర్ స్క్రీన్ల ముందు కూర్చుంటే చేతి వేళ్లకే పని. చాలామందిలో టైపింగ్ స్కిల్స్ అద్భుతంగా ఉంటాయి. చకచకా మెసేజ్‌లు టైప్ చేసేస్తుంటారు. కంప్యూటర్ కీ బోర్డుపై వేళ్లతో అలవోకగా టైపింగ్ చేస్తుంటారు. అయితే ఓ ఫార్మసీ (pharmacy) ఉద్యోగి మాత్రం వెరీ స్పెషల్ అండీ. అతని అద్భుతమైన టైపింగ్ స్పీడ్ చూస్తే మీరు కూడా వండర్ అయిపోతారు.
Mud Puddling : బురద నుంచి సాల్ట్ సేకరిస్తున్న రంగు రంగుల సీతాకోక చిలుకల వీడియో వైరల్
ఓ బిల్లింగ్ కౌంటర్ (billing counter) దగ్గర కూర్చున్న ఫార్మసీ ఉద్యోగి కస్టమర్లకు బిల్లింగ్ ఇస్తూ కనిపించాడు. అయితే అతను కంప్యూటర్ మీద వేళ్లను టైప్ చేస్తున్నాడా.. పరుగులు పెట్టిస్తున్నాడా అనేది అర్ధం కాలేదు. ఒక్క క్షణం మన కళ్లు కూడా చెదిరిపోయేంత స్పీడ్ గా అతని టైపింగ్ కనిపిస్తుంది. పైగా మందుల కోడ్‌లు టైప్ చేస్తూ.. ఒక దాని తర్వాత ఒకటి మందులు (medicines) తీసుకుంటూ కంప్యూటర్ లో తన వేళ్లను పరుగులు పెట్టిస్తున్నాడు. అసలు అతను కీ బోర్డ్ వైపు కూడా చూస్తున్నాడా లేదా అని డౌట్ వస్తుంది. ఈ వీడియో ఇప్పుడ ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.
Groceries on Scooter : ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కిరాణా సామాన్లు తీసుకెళ్తున్న వ్యక్తి వీడియో వైరల్
ఆ ఎంప్లాయి టైపింగ్స్ స్కిల్స్ (typing skills) చూసిన జనం తెగ మెచ్చుకుంటున్నారు. అతనికి వావ్ ఇంత స్పీడా..ఇతనికి ప్రత్యేకమైన టాలెంట్ ఉందని కొందరు.. ముచ్చటైన టైపింగ్ అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.
This receptionist at a busy pharmacy in India. pic.twitter.com/lYk80QQGav
— CCTV IDIOTS (@cctvidiots) April 13, 2023