Petrol-Diesel Price : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అతితక్కువగా ఉన్న రాష్ట్రాలివే.. హైదరాబాద్ ఏ స్థానంలో ఉందంటే?
Petrol-Diesel Price : వ్యాట్, స్థానిక పన్నులు, రవాణా ఖర్చులలోని వ్యత్యాసాల కారణంగా ఇంధన ధరలు రాష్ట్రానికి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు ధరలు, కరెన్సీ సంబంధిత ఒత్తిళ్ల మధ్య పెట్రోల్, డీజిల్ ధరల్లో పెరుగుదల చోటు చేసుకుంటుంది.
- Harish Thanniru
- Updated on- May 23, 2026 / 01:17 PM IST
Petrol-Diesel Price
Petrol-Diesel Price : పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన కొరత ఏర్పడింది. దీంతో ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఆ ప్రభావం భారతదేశంపైనా పడింది. దీంతో ప్రభుత్వ చమురు సంస్థలపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. శనివారం ఉదయం లీటరు పెట్రోల్‌పై 97 పైసలు, డీజిల్‌పై 99 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గడిచిన ఎనిమిది రోజుల్లో ధరలు పెరగడం ఇది మూడోసారి. తాజాగా పెరిగిన ధరలతో భారతదేశంలోని మెట్రో నగరాల్లో అత్యధిక ధరలు హైదరాబాద్ నగరంలోనే ఉండటం గమనార్హం. చంఢీగడ్‍లో పెట్రోల్, డీజిల్ ధరలు అన్ని నగరాల్లో కంటే తక్కువగా ఉన్నాయి.
Also Read : Ivanka Trump : ఇవాంకా ట్రంప్‌ని లేపేయడానికి ప్లాన్.. పట్టుబడిన ఇరాన్ టెర్రరిస్ట్? అతని బ్యాక్‌గ్రౌండ్ ఇదే..
పెట్రోల్ ధరల్లో హైదరాబాద్ టాప్..
పెట్రోల్ పై రూ.97పైసలు పెంపు తరువాత హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ.112.81కి చేరింది. తద్వారా పెట్రోల్ రేటు ఎక్కువగా ఉన్న నగరాల్లో టాప్ ప్లేస్‌లోకి హైదరాబాద్ చేరింది. తిరువనంతపురంలో లీటరు పెట్రోల్ ధర రూ.112.64గా ఉండగా.. కోల్‌కతా, పాట్నాలలో కూడా ధరలు రూ.110 మార్కుకు పైన ఉన్నాయి.
మరోవైపు.. తాజాగా పెంపు తరువాత లీటర్ పెట్రోల్ రేటు చండీగడ్‌లో చౌకగా ఉంది. అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.98.87గా ఉంది. లక్నోలో లీటరు పెట్రోల్ ధర రూ.99.26కాగా.. న్యూఢిల్లీ, నోయిడాలలో ఒక్కోక్కదానిలో లీటరు పెట్రోల్ రూ.99.51 చొప్పున ఉంది.
డీజిల్ ధరలు ఇలా..
లీటర్ డీజిల్ పై శనివారం 99పైసలు పెరిగింది. తాజా పెరుగుదలతో భారతదేశంలో లీటర్ డీజిల్ ఖరీదైన నగరంగా హైదరాబాద్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. హైదరాబాద్ నగరంలో లీటర్ డీజిల్ రూ.100.94 వద్దకు చేరింది. ఆ తరువాత స్థానంలో తిరువనంతపురం ఉంది. ఇక్కడ లీటర్ డీజిల్ రూ.101.55గా ఉంది. భువనేశ్వర్, కోల్‌కతా నగరాల్లో డీజిల్ రేటు రూ.98కి చేరువైంది.
తాజాగా పెంపు తరువాత డీజిల్ ధర తక్కువగా ఉన్న నగరాల్లో చండీగడ్ ప్రథమ స్థానంలో ఉంది. అక్కడ లీటర్ డీజిల్ రూ.86.94తో అత్యంత చౌకగా ఉంది. నోయిడాలో లీటరు డీజిల్ పై రూ.91.93 చొప్పున విక్రయిస్తుండగా.. న్యూఢిల్లీలో రూ.92.49కు చేరింది.
వ్యాట్, స్థానిక పన్నులు, రవాణా ఖర్చులలోని వ్యత్యాసాల కారణంగా ఇంధన ధరలు రాష్ట్రానికి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు ధరలు, కరెన్సీ సంబంధిత ఒత్తిళ్ల మధ్య పెట్రోల్, డీజిల్ ధరల్లో పెరుగుదల చోటు చేసుకుంటుంది.
