Petrol Price : ఇది శుభవార్తే.. 14 రోజులుగా ధరల్లో నో చేంజ్
పెట్రోల్ ధరలు గత 14 రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒకానొక సమయంలో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రూ.120కి చేరువైన లీటర్ పెట్రోల్ ధర.. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో కాస్త తగ్గింది.
- kunduru Vinod
- Published On : November 18, 2021 / 09:49 AM IST
Petrol Price
Petrol Price : పెట్రోల్ ధరలు గత 14 రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఒకానొక సమయంలో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రూ.120కి చేరువైన లీటర్ పెట్రోల్ ధర.. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో కాస్త తగ్గింది. మరికొన్ని రాష్ట్రాలు కేంద్రం బాటలో పయనించడంతో మరికొంత తగ్గింది. గత కొన్నిరోజులుగా డీజిల్, పెట్రోల్ ధరల్లో మార్పులు లేవు. అన్ని ప్రాంతాల్లో ఫ్యూయల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గురువారం దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
చదవండి : Petrol Diesel Price: ఇవాళ్టి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవీ
న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.97 గా ఉంది, లీటర్ డీజిల్ రూ. 88.67 వద్ద కొనసాగుతోంది.
ముంయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.98 గా ఉండగా, డీజిల్ రూ. 94.14 గా ఉంది.
చెన్నైలో గురువారం లీటర్ పెట్రోల్ ధర రూ. 101.56 వద్ద కొనసాగుతుండగా, డీజిల్ రూ. 91.58 గా ఉంది.
బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.58 గా ఉండగా, డీజిల్ రూ. 85.01వద్ద కొనసాగుతోంది.
చదవండి : Petrol Prices Today: పంజాబ్‌లో భారీగా తగ్గిన పెట్రోల్ ధర.. దేశవ్యాప్తంగా రేట్లు ఇవే!
తెలుగు రాష్ట్రాల్లో
హైదరాబాద్‌లో గురువారం లీట్ పెట్రోల్ రూ. 108.20గా ఉంది, ఇక డీజిల్ రూ. 94.62 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.51 వద్ద ఉండగా, డీజిల్ ధర రూ. 96.59 గా ఉంది.
సాగర నగరం విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.90 వద్ద కొనసాగుతుండగా, డీజిల్ ధర రూ. 95.57 గా నమోదైంది.
