Petrol Price: 5 రాష్ట్రాల్లో రూ.100 దాటిన పెట్రోల్ ధర
పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఆదివారం పెట్రోల్ పై 27 పైసలు పెరిగింది. దీంతో పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.100 మార్క్ దాటింది.
- kunduru Vinod
- Updated on- June 6, 2021 / 07:03 PM IST
Petrol Price
Petrol Price: పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఆదివారం పెట్రోల్ పై 27 పైసలు పెరిగింది. దీంతో పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.100 మార్క్ దాటింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100 కంటే ఎక్కువే ఉంది. పెట్రోల్,డీజిల్ రేట్లు పెరుగుతుండటంతో సామాన్యులపై రోజు రోజుకు భారం పెరుగుతుంది. ఇక ఇప్పుడు పంటలు వేసే సీజన్ కావడంతో రైతులపై డీజిల్ రేట్ల ప్రభావం అధికంగా ఉంటుంది. గతేడాది జూన్ నెలలో రూ.80 కి లభించిన డీజిల్ 2021 జూన్ వచ్చే సరికి రూ. 95 దాటింది. ఏడాది వ్యవధిలో రూ.15 రూపాయలు పెరిగింది. ఇది రైతులపై పెను భారమని చెప్పవచ్చు.
