Fuel Prices: పెట్రోల్ ధరలు తగ్గించం.. కేంద్ర ప్రభుత్వంపై 12,000 కోట్ల భారం.. కేంద్ర మంత్రి సురేష్ గోపి కీలక వ్యాఖ్యలు
భారత్ లో పెట్రోల్, డీజిల్(Fuel Prices) ధరలపై కేంద్ర చమురు, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి స్పష్టం చేశారు.
- V Santhosh Kumar
- Published on- June 18, 2026 / 11:39 AM IST
Petroleum minister suresh gopi shocking comments on petrol diesel price reduction
- అంతర్జాతీయంగా తగ్గుతున్న ముడి చమురు.
- ఇంధన ధరల తగ్గింపునకు సమయం.
- కేంద్రంపై రూ.12,000 కోట్ల భారం.
Fuel Prices: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు తగ్గుముఖం పడుతున్నప్పటికీ, భారతీయ వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ ధరల నుంచి తక్షణ ఉపశమనం లభించే అవకాశం లేదు. అంతర్జాతీయంగా ధరలు తగ్గినా, అవి దేశీయ బంకుల వద్ద ప్రతిఫలించడానికి సమయం పడుతుందని కేంద్ర చమురు, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి గురువారం స్పష్టం చేశారు. తక్కువ ధర కలిగిన చమురు రవాణా మన దేశానికి చేరుకోవడానికి పట్టే సమయంతో పాటు మరెన్నో అంశాలు రిటైల్ ధరలను ప్రభావితం చేస్తాయని ఆయన వివరించారు.
Bombay High Court: భర్త చనిపోయినా భరణం చెల్లించాల్సిందే.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు
చౌకగా లభించే ముడి చమురు(Fuel Prices) ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ గుండా భారతదేశానికి రవాణా కావాల్సి ఉంటుందని, అక్కడ ప్రస్తుతం నౌకల రాకపోకల రద్దీ ఎక్కువగా ఉందని మంత్రి తెలిపారు. ఈ పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుందన్నారు. ఇటీవల పెరిగిన ఇంధన ధరల వల్ల వినియోగదారులపై లీటరుకు రూ. 3.94 మేర ప్రభావం పడిందని, అంతర్జాతీయంగా ధరలు తగ్గినంత మాత్రాన ఈ పెంపును వెంటనే వెనక్కి తీసుకోలేమని ఆయన పేర్కొన్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చమురు కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయని, వినియోగదారులపై భారం పడకుండా కేంద్రమే ఆ ప్రభావాన్ని భరించిందని సురేష్ గోపి గుర్తుచేశారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రూ. 12,000 కోట్లు నష్టపోయిందని, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించుకోలేదని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నడవాలన్నా, చమురు కంపెనీలు మనుగడ సాగించాలన్నా ఇవన్నీ పరిగణనలోకి తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
