Hold On Babe : ఫస్ట్ నైట్..భార్యను పక్కనే పెట్టుకుని కంప్యూటర్ తో ఏం చేస్తున్నావురా బాబూ..

Computer on Wedding Night :

ఏడడుగులతో ప్రారంభమైన వివాహ బంధం జీవితాంతం జీవితాంతం సుఖంగా సాగాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. కని పెంచిన తల్లిదండ్రుల్ని..తోబుట్టువులను వదిలి..కోటి ఆశలతో కొత్త జీవితంలో అడుగు పెడుతుంది ఆడపిల్ల. తొలిరాత్రితో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. అప్పటి వరకూ ఒకరికొకరు తెలియకపోయినా మొదటిరాత్రితో మొదలైన పరిచయం ఒకరినొకరు ఒక్కరోజు కూడా విడిచి ఉండలేని బంధానికి దారి తీస్తుంది.

కానీ కోటి ఆశలతో ఎన్నెన్నో కలలతో మొదటిరాత్రి భర్త గదిలోకి వచ్చిన ఓ కొత్త పెళ్లి కూతురికి చేదు అనుభవం ఎదురైంది. సిగ్గుపడుతూ..భర్తే తనను పలకరిస్తాడని ఎదురుచూసిన ఓ నూతన వధువును ఏమాత్రం పట్టించుకోకుండా కంప్యూటర్ పట్టుకుని కుస్తీలు పడుతున్న భర్తను చూసి షాక్ అయ్యిందామె.

శోభనం గదిలో తనను పట్టించుకోకుండా..కంప్యూటర్ పట్టుకుని ఏదో పని చేస్తున్నట్లు కూర్చున్న భర్తను చూసిన ఆ నవ వధువే కాదు అందరూ షాక్ అయ్యారు. చక్కగా అలంకరించుకుని వచ్చిన ఓ నవ వధువు శోభనం గదిలో బెడ్ పై కూర్చొని ఉండగా..వరుడు మాత్రం..కంప్యూటర్ పట్టుకుని ఏదో పనిచేసుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ ఫొటోపై నెటిజన్లు సరదా సరదా..కామెంట్స్ పెడుతున్నారు. ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ ఫొటోను హోల్డ్ అన్ బేబీగా నెటిజన్లు పిలుస్తూ..ఒక్కో క్యాప్షన్ ఇస్తున్నారు. బేబీ కొద్దిసేపు ఆగు..ముందు నన్ను ట్విట్టర్ నోటిఫికేషన్స్ చెక్ చేసుకోనివ్వూ..అంటూ ఒకరు..నేను డ్యాన్స్ చేస్తున్న ఫొటోను అప్ లోడ్ చేసే వరకు వెయిట్ చేయి..మరో నెటిజన్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు